మళ్లీ మాలీవుడ్ లో కళావతి!
కీర్తి సురేష్ అలియాస్ కళావతి మాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో ఎంతగా ఫేమస్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 14 Feb 2025 7:00 AM GMTకీర్తి సురేష్ అలియాస్ కళావతి మాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో ఎంతగా ఫేమస్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ కి కూడా వెళ్లింది. ప్రస్తుతం అక్కడా సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. ఒకానొక దశలో తెలుగులో అవకాశాలకు దూరమవుతోంది అనుకుంటోన్న సమయంలో సిస్టర్ రోల్స్, గెస్ట్ రోల్స్ కి సైతం సై అని మళ్లీ హీరోయిన్ గా ఫాంలోకి వచ్చింది.
అప్పటి నుంచి కీర్తి కెరీర్ మరింత బిజీగా మారింది. ఈ క్రమంలో అమ్మడు సొంత భాష మాలీవుడ్ కి మాత్రం దూరమైంది. టాలీవుడ్ లో సినిమాలు చేసినా పేర్లలల్ గా అప్పుడప్పుడు మాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది కొంత కాలం. అయితే తర్వాత కాలంలో మాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. అమ్మడు అక్కడ సినిమాలు చేసి మూడేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కళావతి అక్కడ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింది.
ఈ విషయాన్ని నటుడు ఆంటోనీ థామస్ రివీల్ చేసాడు. ప్రస్తుతం ఆంటోని కొన్ని సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉన్నానని, ఈ సినిమాల తర్వాత కీర్తి తో ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నాడు. ఇప్పటికే కీర్తి సురేష్ టివినో థామస్ సరసన `వాషీ` అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇప్పుడు అదే హీరోతో సొంత భాషలో కంబ్యాక్ అవుతోంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ్ లో ఓ చిత్రం, హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో అవకాశాలు వస్తున్నా? ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమ్మడు గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసిన నేపథ్యంలో ఛాన్సులొస్తున్నాయి. కానీ కంగారు పడకుండా కమిట్ అవుతుంది. `అక్కా` అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో పోటీ పడి నటిస్తోన్న సంగతి తెలిసిందే.