కీర్తి నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్లు.. ఏంటీ ఇవన్నీ నిజమేనా?
కీర్తి సురేష్.. గతంలో కంటే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన విషయం బాగానే హైలెట్ అవుతోంది.
By: Tupaki Desk | 27 March 2025 6:30 AMకీర్తి సురేష్.. గతంలో కంటే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన విషయం బాగానే హైలెట్ అవుతోంది. పెళ్లి అనంతరం అమ్మడు గ్లామర్ పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుకుంటోంది. కానీ అమ్మడు ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం వెనుకబడినంత పని అవుతోంది. ఒకప్పుడు వరుస అవకాశాలతో పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ మలయాళ బ్యూటీ, ఇప్పుడు మాత్రం సినిమాల ఎంపిక విషయంలో కాస్త వెనుకబడినట్టే కనిపిస్తోంది.
అంతే కాకుండా వరుస సినిమాలు కూడా నిరాశపరుస్తున్నాయి. అయినా సరే, ఆమెపై టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలు ప్రతిపాదనలు వస్తుండటమే కాదు, కొన్ని సెన్సేషనల్ కాంబినేషన్లు రూమర్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో, ఊహాగానమెంతో ఇంకా స్పష్టత లేదు కానీ, అభిమానుల్లో మాత్రం ఆసక్తి మోతాదుగా ఉంది. తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. కీర్తి సురేష్, రణబీర్ కపూర్ సరసన ఓ లవ్ స్టోరీలో నటించనుందట.
ప్రస్తుతం రణబీర్ రామాయణం, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఈ కాంబినేషన్ వర్కవుట్ కావడం సందేహంగానే కనిపిస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రకారం, నితిన్ – వేణు యెల్దండీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఎల్లమ్మ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కీర్తి టైటిల్ రోల్ చేయబోతున్నట్లు టాక్. ఇది అధికారికంగా ఎనౌన్స్ కాకపోయినా, దాదాపుగా కన్‌ఫర్మ్ అనేలా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
అలాగే విజయ్ దేవరకొండ రౌడి జనార్దన్ కూడా అమ్మడికే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. రవికిరణ్ కోల దర్శకత్వంలో రూపొందే రూరల్ పొలిటికల్ డ్రామా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందన్న టాక్ బలంగా ఉంది. ఇది నిజంగా కన్ఫర్మ్ అయితే, కీర్తికి కమర్షియల్ గా పెద్ద బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆమె నటించిన కొన్ని ప్రాజెక్టులు ఇంకా లైన్‌లో ఉన్నాయి.
చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న రివాల్వర్ రీటా ఇప్పటికీ విడుదల తేదీని చూడలేకపోతోంది. సుహాస్‌తో చేస్తున్న ఉప్పు కప్పురంబు మూవీ కూడా ఏ దశలో ఉందో క్లారిటీ లేదు. కీర్తి బిజీగా కనిపించినా, ఆమె చేతిలో స్ట్రాంగ్ కమర్షియల్ ప్రాజెక్ట్ లేదు. మహానటితో వచ్చిన ఫేమ్‌ను సస్టైన్ చేయడంలో ఆమె పూర్తిగా సక్సెస్ కాలేకపోయినట్టే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఏ ఒక్క సినిమా ఓకే అయినా అమ్మడి దశ తిరిగినట్లే. మరి మహానటి లక్కు ఎలా ఉందో కాలమే సమాధానం ఇవ్వాలి.