కీర్తి సురేష్ ని తీసుకుంటే సినిమా ఆగిపోతుందన్నారు!
మలయాళ నటి మేనక కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 11 Nov 2024 11:30 PM GMTమలయాళ నటి మేనక కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మహా నటి సినిమా తర్వాత కీర్తి గ్రాఫ్ ఎలా పెరిగిందన్నది తెలిసిందే. పాన్ ఇండియాలోనే అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. లెజెండరీ నటి సావిత్రి పాత్రలో ఆమె అభినయించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత కొత్త సినిమా చేయాలంటే? ఎన్నో విషయాలు సైతం ఆలోచించుకోవాల్సిన ఒత్తిడిని సైతం కీర్తి ఎదుర్కుంది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇప్పుడు కీర్తి సినిమాలు చేస్తోంది. తాజాగా అమ్మడు కెరీర్ తొలి దశను తలుచుకుంది. `నేను పరిశ్రమకి వచ్చిన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంది. అప్పుడప్పుడు బాధ గానూ ఉంటుంది. అప్పుడు ఓ మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నేను మా అమ్మలా నటిని కాబోతున్నాను అని సంబర పడేలో పే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత మరో రెండు సినిమాలకు సంతకం చేసాను.
కానీ అవి కూడా మధ్యలో ఆగిపోయాయి. దాంతో నన్నంతా ఐరెన్ లెగ్ అనడం మొదలు పెట్టారు. నన్ను తీసు కుంటే సినిమా ఆగిపోతుందని ప్రచారం చేసారు. కానీ నేను నా ప్రయత్నాలు ఆపలేదు. క్రమంగా వరుస సినిమాలు చేసినా నేను ఎదుర్కున్న అవమానాలు గుర్తొచ్చేవి. కానీ సినిమాని బట్టి నన్ను నేను మెరుగు పరుచుకునే దాన్ని. అన వసరంగా సమయం వృద్ధా చేయలేదు` అని తెలిపింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. రివాల్వర్ రీటా, కన్నె వేది తమిళ సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అలాగే హిందీలో బేబీ జాన్ లో నటిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.