Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ మూవీ.. ఈసారి ఏం జరుగుతుందో?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sep 2024 7:14 AM GMT
కీర్తి సురేష్ మూవీ.. ఈసారి ఏం జరుగుతుందో?
X

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలుగులో దసరాతో వచ్చి మంచి హిట్ అందుకున్న అమ్మడు.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ లో కనిపించింది. ఇప్పటి వరకు మరో టాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం తమిళంలో క‌న్నివీడి, రివాల్వ‌ర్ రీటా సినిమాల్లో నటిస్తోంది. త్వరలో బాలీవుడ్ లోకి బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇవ్వనుంది కీర్తి.

రీసెంట్ గా పొలిటిక‌ల్ కామెడీ మూవీ ర‌ఘు తాతతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కేజీఎఫ్ ఫేమ్ హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మించిన రఘుతాత మూవీ.. మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి వచ్చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే రఘు తాత మూవీలో కీర్తి సురేష్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడగా.. సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. చెప్పాల్సిన పాయింట్ ను డైెరెక్టర్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడంతో హిట్ స్టేటస్ అందుకోలేకపోయింది. దీంతో మూవీ రిలీజ్ అయ్యాక.. ఎక్కడా ఎలాంటి టాక్ వినిపించలేదు. ఎప్పుడు థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిందో కూడా తెలియదు. మూవీ రిలీజ్ కు ముందు కూడా బజ్ క్రియేట్ అవ్వలేదు.

కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్ హిట్లను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్.. రఘు తాత నిర్మించడంతో సినిమాపై కొందరు మూవీ లవర్స్ మాత్రం అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా వాటిని అందుకోలేకపోయింది. మూవీ విషయంలో ట్రోల్స్, కామెంట్స్ రావడం పక్కన పెడితే.. రఘు తాత సినిమాను ఆడియన్స్ పూర్తిగా రిజెక్ట్ చేసేశారు. దీంతో మంచి టాలెంట్ ఉన్న కీర్తికి ఇది బాధపెట్టే విషయమే. అలా కీర్తి సురేష్ ఖాతాలోకి ఫ్లాప్ చేరింది.

అయితే ఇప్పుడు ఓటీటీలోకి రఘు తాత మూవీ రాబోతోంది. థియేటర్లలో నిరాశపరిచిన పలు సినిమాలు.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అయిన రఘు తాత సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి రానుంది. మరి ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.