Begin typing your search above and press return to search.

15 ఏళ్ల ప్రేమ.. ఇంత మోసం అనుకోలేదు..!

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైం లోనే కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 6:33 AM GMT
15 ఏళ్ల ప్రేమ.. ఇంత మోసం అనుకోలేదు..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లాడింది. ప్రేమ పెళ్లి గురించి మొన్నటి దాకా చాలా సీక్రెట్ గా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి మరో రెండు వారాలు ఉంది అన్నప్పుడు మాత్రమే మీడియాకు లీక్స్ ఇస్తూ ఆమె కూడా ఓపెన్ అయ్యింది. కథానాయికగా ఇప్పటికే ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచేసిన కీర్తి సురేష్ తన మనసు మాత్రం తన స్నేహితుడు ఆంటోనికి ఇచ్చేసింది. ఐతే వీరిద్దరి ప్రేమ అనుబంధం చాలా సీక్రెట్ గా జరిగింది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైం లోనే కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇంటర్ లోనే ఆంటోనితో ప్రేమలో పడిందట కీర్తి సురేష్. 2010 లోనే అతను ప్రపోజ్ చేశాడని ఐతే 2016 నుంచి మా లవ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ తను ఇచ్చిన ప్రామిస్ రింగ్ ని తీయకుండా అలానే ఉంచుకున్నానని. మా పెళ్లి ఒక కల అని.. అది ఇంత ఘనంగా జరిగినందుకు సంతోషంగా ఉందని అంటుంది కీర్తి సురేష్.

ఐతే కీర్తి సురేష్ 15 ఏళ్ల ప్రేమ గురించి తెలిసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు తెర మీద ప్రతి సినిమాలో హీరోలను ప్రేమిస్తూ వచ్చిన అమ్మడు రియల్ లైఫ్ లో ఆల్రెడీ తన మనసు 15 ఏళ్ల క్రితమే ఇచ్చేసిందా ఎంత మోసం అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే ఆమె హ్యాపీ కాబట్టి మేము కూడా హ్యాపీ అనేస్తున్నారు. ఐతే భర్త గురించి చెబుతూ ఆంటోని ఖరత్ లో బిజినెస్ చేస్తున్నాడని.. తన కెరీర్ లో అతను ఎంతో సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడని చెప్పుకొచ్చింది.

అంతేకాదు తను చాలా మొహమాటస్తుడు అందుకే ఫోటోలకు సరిగా స్టిల్స్ కూడా ఇవ్వలేదని అంటుంది కీర్తి సురేష్. తన ప్రేమ విషయం తన క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కు తెలుసని.. ఐతే దాపరికం అని కాదు కానీ అలా ఉంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. సో కీర్తి రియల్ లైఫ్ లో ప్రేమికుడిని 15 ఏళ్ల క్రితమే ఎంపిక చేసుకుందా అంటూ అవాక్కవ్వడం ఆడియన్స్ వంతు అయ్యింది.