Begin typing your search above and press return to search.

లవ్‌ స్టోరీకి సూపర్‌ అంటూ కీర్తి సురేష్ రివ్యూ!

'రాయన్‌' సినిమా తర్వాత ధనుష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'నిలవుకు ఎన్‌మేల్‌ ఎన్నడి కోబమ్‌'. ఈ సినిమాతో ధనుష్‌ తన మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 10:08 AM GMT
లవ్‌ స్టోరీకి సూపర్‌ అంటూ కీర్తి సురేష్ రివ్యూ!
X

'రాయన్‌' సినిమా తర్వాత ధనుష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'నిలవుకు ఎన్‌మేల్‌ ఎన్నడి కోబమ్‌'. ఈ సినిమాతో ధనుష్‌ తన మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లుడి బాధ్యతను ధనుష్ భుజాలపై వేసుకోవడంతో మొదటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనిఖ సురేంద్రన్‌, ప్రియా ప్రకాష్ వారియర్‌ నటించారు. ముఖ్య పాత్రలో మాథ్యూ థామస్ నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాకు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

కీర్తి సురేష్ 'నిలవుకు ఎన్‌మేల్‌ ఎన్నడి కోబమ్‌' సినిమా ప్రీమియర్ షో చూశారు. సినిమా చూసిన తర్వాత కీర్తి సురేష్ స్పందిస్తూ.... సినిమాను ఇప్పుడే చూశాను. సినిమా కొత్తగా అనిపించింది. ధనుష్ గారు మరోసారి మీ దర్శకత్వంలో విభిన్నమైన సినిమాను చూసే అవకాశం కల్పించారు. మీ మేకింగ్‌ స్టైల్‌ నాకు చాలా నచ్చుతుంది. అదే స్టైల్‌ ఇందులోనూ కొనసాగింది. సినిమాలో చాలా ఎక్కువ మంది నటీనటులు ఉన్నారు. వారందరినీ చక్కగా చూపిస్తూ, వారి పాత్రలకు ప్రాముఖ్యత కల్పిస్తూ కథను, స్క్రీన్‌ప్లేను నడిపించడం మామూలు విషయం కాదు. అందరిని అలా చూడటం చాలా సంతోషంగా అనిపించింది.

స్క్రీన్‌పై పవిష్‌ ను చూస్తూ ఉంటే ధనుష్ గారిని చూసినట్లే ఉంది. ఆయన యాక్టింగ్‌, హావభావాలు, డైలాగ్‌ ఇలా ప్రతిదీ ధనుష్ గారిని గుర్తు చేసే విధంగా చేశాడు. మొదటి సినిమానే అయినా పవిష్ స్క్రీన్‌పై ఒదిగి పోయాడు. ఒక అద్భుతమైన సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినందుకు అభినందనలు. మాథ్యూ థామస్ గారు మీ పాత్ర చాలా రోజులు గుర్తుండి పోతుంది. సినిమాలో మీ పాత్ర చక్కగా ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రియాంకా మోహన్‌ నీ డాన్స్‌ చాలా బాగుంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆకట్టుకున్నారు. సినిమా సక్సెస్ టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

ధనుష్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా సాగింది. లవ్‌ స్టోరీని పెద్ద పెద్ద యాక్షన్‌ సన్నివేశాలతో, ట్విస్ట్‌లతో కాకుండా సింపుల్‌గా సరదాగా కూడా చెప్పవచ్చు అని ధనుష్ ఈ సినిమాతో నిరూపించారు. సినిమాకు నెటిజన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. తెలుగు లో ఈ సినిమాను జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్‌తో విడుదల చేశారు. పెద్ద సినిమాలు లేకపోవడంతో ధనుష్‌ అభిమానులు ఎక్కువ మంది ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్‌ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.