Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ఈ టాక్ ఊహించ‌లేదే

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద బేబి జాన్ ని వెన‌క్కి నెట్టేసి దుమ్ము రేపుతోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 3:35 AM GMT
కీర్తి సురేష్ ఈ టాక్ ఊహించ‌లేదే
X

మ‌హాన‌టిగా తెలుగు ప్ర‌జ‌ల అభిమానం సంపాదించుకున్న‌ కీర్తి సురేష్ ఈ ఏడాది ముగింపులో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కీర్తి న‌టించిన `బేబి జాన్` ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. వ‌రుణ్ ధావ‌న్ - కీర్తి జంట‌గా న‌టించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌మిళ చిత్రం `తేరి`కి రీమేక్. అట్లీ హిందీ వెర్ష‌న్ ని నిర్మించాడు. అయితే ఈ సినిమాకి తొలి రోజు క్రిటిక్స్ నుంచి ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. వ‌రుణ్ ధావ‌న్ న‌ట‌న‌కు మంచి మార్కులే వేసినా కానీ, క్రిటిక్స్ కీర్తి పాత్ర‌లో మ్యాట‌ర్ లేని తేల్చేసారు. పైగా కీర్తి పాత్ర ఇందులో చ‌నిపోతుంది. గ్లామ‌ర్ డోస్ ప‌రంగాను కీర్తి నార్త్ ఆడియెన్ రేంజుకు మ్యాచ్ చేయ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించారు. ఇక పోటీబ‌రిలో ఉన్న పుష్ప‌రాజ్ (పుష్ప 2) హ‌వా ముందు కూడా బేబి జాన్ నిల‌వ‌లేక‌పోయాడు. కార‌ణం ఏదైనా కానీ, కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇది వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు. క‌నీసం త‌దుప‌రి ప్ర‌య‌త్నం అయినా స‌ఫ‌ల‌మ‌వుతుందేమో చూడాల‌ని నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు. కీర్తి ఇప్ప‌టికే బాలీవుడ్ లో త‌న రెండో సినిమాకి క‌మిటైంద‌ని ప్ర‌చారం ఉంది.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద బేబి జాన్ ని వెన‌క్కి నెట్టేసి దుమ్ము రేపుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ భారతదేశంలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్ల రికార్డును అధిగ‌మించి ఇప్పటికే చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రొడక్షన్ హౌస్ YRF కూడా కొత్త చరిత్రను రాస్తూ కొత్త రికార్డులను నెలకొల్పినందుకు `పుష్ప 2` బృందాన్ని అభినందించింది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఇప్పటికీ భారీ వసూళ్లను కొనసాగిస్తోంది.

క్రిస్మస్ పండుగ రోజున `పుష్ప- 2` హిందీ వెర్షన్ కొత్త చిత్రం `బేబీ జాన్` నుండి పోటీని ఎదుర్కొన్నా కానీ భారతదేశంలో సుమారు రూ. 19.5 కోట్లు (నెట్) వసూలు చేసింది. స్క్రీన్‌లను తగ్గించినా కానీ పుష్ప‌రాజ్ హ‌వా ఆగ‌లేదు. మరోవైపు వరుణ్ ధావన్- కీర్తి సురేష్ నటించిన `బేబీ జాన్` ప్రారంభ రోజున కేవలం రూ 10 కోట్లు (నెట్) వసూలు చేసింది. క్రిస్మస్ పండుగ రోజున `బేబీ జాన్` కంటే `పుష్ప 2` రెట్టింపు డబ్బును రాబట్టింది. `పుష్ప 2` తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా దాని రన్‌ను ముగించింది. హిందీ వెర్షన్ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. హిందీ వెర్షన్ భారతదేశంలో రూ. 800 కోట్ల నికర వసూళ్లను దాటే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.