Begin typing your search above and press return to search.

సంక్రాంతి స్పెషల్‌ క్లిక్‌... పెళ్లి కళ ఇంకా పోలే

దాంతో అజయ్‌ దేవగన్‌కి జోడీగా కీర్తి సురేష్ కాకుండా సీనియర్‌ హీరోయిన్‌ ప్రియమణిని ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2025 9:03 AM GMT
సంక్రాంతి స్పెషల్‌ క్లిక్‌... పెళ్లి కళ ఇంకా పోలే
X

తెలుగులో నటించిన మహానటి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సౌత్‌లో అన్ని భాషల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా హిందీలోనూ నటించింది. బాలీవుడ్లో బేబీ జాన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కీర్తి సురేష్‌కి అక్కడ మంచి పేరు దక్కింది. బాలీవుడ్‌లో మైదాన్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో వీలు పడలేదు. దాంతో అజయ్‌ దేవగన్‌కి జోడీగా కీర్తి సురేష్ కాకుండా సీనియర్‌ హీరోయిన్‌ ప్రియమణిని ఎంపిక చేసిన విషయం తెల్సిందే.


ఇటీవల ఒక చిట్‌చాట్‌లో కీర్తి సురేష్ ఆ విషయం గురించి చెప్పుకొచ్చింది. మైదాన్‌లో నటించాల్సి ఉన్నా తాను బేబీ జాన్‌తో బాలీవుడ్‌లో పరిచయం అయ్యాను అంది. అట్లీ సినిమా కావడంతో కాదు అనలేక పోయినట్లుగా చెప్పింది. అంతే కాకుండా సమంత ఈ సినిమాకు తనను రిఫర్ చేసిందని, తనను ప్రోత్సహించి నటించేలా చేసిందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సౌత్‌లో తమిళ్‌, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు హిందీలో మరో సినిమాను ఈ ఏడాది కమిట్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

ఇక సంక్రాంతి సందర్భంగా భర్తతో దిగిన ఫోటోతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. భర్తతో ఉన్న ఫోటోలో కీర్తి సురేష్ ఫేస్ వెలిగి పోతుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. కీర్తి సురేష్ మొహంలో ఇంకా పెళ్లి కళా అలాగే ఉందని, ఆమె కొత్త పెళ్లి కూతురుగానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు గర్భవతుల ఫేస్‌ వెలిగినట్లు కీర్తి సురేష్ మొహంలో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతుందా అంటూ కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఎవరికి తోచిన విధంగా వారు కీర్తి సురేష్ ఫోటోలకు స్పందిస్తూ ఉన్నారు.

పండుగ వైబ్‌ కనిపించే విధంగా పసుపు రంగు చీర కట్టులో కీర్తి సురేష్ కనిపించింది. వావ్‌ అనిపించే అందంతో పాటు మెడలో సాంప్రదాయ బద్దంగా మంగళ సూత్రం ధరించడం ద్వారా ఆమెకు మరింత మంది ఫిదా అవుతున్నారు. ఇటీవల మంగళ సూత్రం గురించి మాట్లాడుతూ పెళ్లిలో కట్టిన ఆ మంగళ సూత్రం ను కొన్ని రోజుల వరకు తొలగించకూడదు అంది. కొన్ని రోజుల తర్వాత ఆ స్థానంలో గోల్డ్‌ చైన్‌ వేస్తారు. ఆ సమయంలో చైన్‌ ఏదైనా షూట్‌ అప్పుడు తీసేయవచ్చు. కానీ ఇప్పుడు పసుపు దారం తొలగించను అంది. పెళ్లి అయినా తన సినిమాల ఎంపికలో ఎలాంటి మార్పు ఉండదని, రాబోయే రోజుల్లో వరుసగా సినిమాలు చేస్తాను అంది.