కీర్తి తాళి బొట్టు.. థై స్లిట్ గౌను..మ్యాచ్ కాలేదే
15ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్యా ప్రేమాయణం కొనసాగుతోందని మీడియాలో కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 5:34 AM GMT'మహానటి' కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోని తాటిల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆంటోని దుబాయ్ కేంద్రంగా రెస్టారెంట్ చైన్ బిజినెస్ లో సుప్రసిద్ధుడు. 15ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్యా ప్రేమాయణం కొనసాగుతోందని మీడియాలో కథనాలొచ్చాయి. ఇటీవల ఈ జంట హిందూ, క్రిస్టియన్ విధానాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోవడం ఆసక్తిని కలిగించింది. కీర్తి-ఆంటోని పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగానే తన బాలీవుడ్ ఆరంగేట్ర సినిమా 'బేబి జాన్' ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది. కాళ్లకు పారాణి అయినా ఆరకుండానే కీర్తి ముంబైలో పార్టీకి అటెండయ్యింది. ఆసక్తికరంగా ఈ పార్టీలో కీర్తి సురేష్ తాళిబొట్టుతో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. చూడటానికి పూర్తిగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన కీర్తి తన తాళిబొట్టును ప్రదర్శించేందుకు ఆసక్తిని కనబరిచింది. స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఈవెంట్లో కీర్తి తాళిబొట్టు హైలైట్ అయ్యేలా కెమెరాల్ని క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్, వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. కీర్తి తాళి బొట్టు.. థై స్లిట్ గౌను..మ్యాచ్ కాలేదే అంటూక ఒందరు కామెంట్ చేసారు.
కీర్తి సురేష్ మోడ్రన్ అమ్మాయే అయినా ఇలా తాళిబొట్టును గౌరవించడాన్ని చాలామంది ప్రశంసించారు. సాంప్రదాయాన్ని, భర్తను గౌరవించే మహిళ అంటూ కీర్తించారు. కానీ అలాంటి మోడ్రన్ డ్రెస్ లో వెళుతున్నప్పుడు తాళి బొట్టు మ్యాచ్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ శుభసమయాన ఇలాంటి వేషంలో వెళ్లాల్సింది కాదని కామెంట్ చేస్తున్నారు. అయితే తన సినిమా రిలీజ్ సమయంలో కీర్తి పార్టీల నుంచి తప్పించుకునేందుకు ఛాన్సే లేదు. అందుకే పెళ్లయిన వెంటనే విధిగా తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాళిబొట్టు గురించి ముంబై మీడియా అతి చేస్తోందని కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాతా కీర్తి తన నటనా కెరీర్ ని యథేచ్ఛగా కొనసాగించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. కరీనా, కత్రిన, దీపిక, ఆలియా తరహాలో పెళ్లి తర్వాతా బిజీ అవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.