కొత్త జంట.. కలర్ ఫుల్ అంట..!
ఐతే పెళ్లి అయిన వెంటనే బేబీ జాన్ సినిమా రిలీజ్ కోసం ఆ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అమ్మడు ఇప్పుడు మళ్లీ పెళ్లి నాటి విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
By: Tupaki Desk | 30 Jan 2025 5:15 PM GMTమలయాళ భామ కీర్తి సురేష్ ఈమధ్యనే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లాడిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా సరే ఎక్కడ ఎవరికీ ఏమాత్రం డౌట్ రాకుండా మ్యానేజ్ చేసింది. తెర మీద ఎంతోమంది హీరోలకు ప్రేయసిగా మారిన కీర్తి సురేష్ తన మనసుని మాత్రం భద్రంగా తన ప్రేమికుడికి ఇచ్చేసింది. ఐతే పెళ్లి అయిన వెంటనే బేబీ జాన్ సినిమా రిలీజ్ కోసం ఆ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అమ్మడు ఇప్పుడు మళ్లీ పెళ్లి నాటి విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఆంటోనీతో కలిసి ఆడి పాడి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని షేర్ చేసింది. కీర్తి సురేష్ ఆంటోని కొత్త జంట కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. జంట పక్షులుగా కనిపిస్తున్న ఈ ఇద్దరి ఫోటోలు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సౌత్ లో ఒకటి అరా తప్ప పెద్దగా అవకాశాలు లేవు.
బేబీ జాన్ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో కెరీర్ కొనసాగించాలని అనుకుంది కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. తెలుగులో ఐతే దసరా, భోళా శంకర్ చేసిన అమ్మడు మళ్లీ ఛాన్సులు రాబట్టలేదు. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ అప్పటి నుంచి తన స్పీడ్ పెంచేసింది. ఐతే అమ్మడు హిందీలో తన సత్తా చాటాలని అనుకున్నా తొలి సినిమాతోనే రిజల్ట్ నిరాశపరచింది.
తమిళ్ లో కీర్తి సురేష్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్టార్ ఛాన్స్ లు వస్తాయి. ఐతే తెలుగులో ఎందుకో అమ్మడు వెనకబడింది. తన న్యాచురల్ యాక్టింగ్ తో సౌత్ ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చుకున్న కీర్తి సురేష్ ఈమధ్య గ్లామర్ డోస్ కూడా పెంచి సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే బాలీవుడ్ లో తన గ్లామర్ షో వల్ల కెరీర్ కి ప్లస్ అవుతుందని అనుకోగా నెక్స్ట్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేలా కనిపిస్తుండగా అప్పటిదాకా అమ్మడి సోషల్ మీడియా అప్డేట్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది.