Begin typing your search above and press return to search.

ఆమె పెళ్లి చీర కోసం బంగారంతో 405 గంటలు..!

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె రెగ్యులర్‌గా షేర్‌ చేస్తూ వస్తుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:53 AM GMT
ఆమె పెళ్లి చీర కోసం బంగారంతో 405 గంటలు..!
X

హీరోయిన్‌ కీర్తి సురేష్ వివాహం వైభవంగా జరిగింది. డిసెంబర్‌ 12న గోవాలో కీర్తి సురేష్‌, ఆంటోనీ తటిల్ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకలు నిన్న ఆదివారం పూర్తి అయ్యాయి. 12వ తారీకు హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది, ఆదివారం చర్చిలో క్రిస్టియన్‌ పద్దతిలో వివాహం జరిగింది. అదే రోజు వారి వివాహ రిసెప్షన్‌ వేడుక జరిగింది. మొత్తంగా గోవాలో కీర్తి సురేష్ గత వారం రోజులుగా పెళ్లి వేడుకలో బిజీ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె రెగ్యులర్‌గా షేర్‌ చేస్తూ వస్తుంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర గురించి ఆసక్తికర ప్రచారం జరిగింది. పెళ్లి కోసం కీర్తి సురేష్ ప్రత్యేకంగా తన చీరను డిజైన్ చేయించుకుందట. కాంచీపురంలో నేసిన ఈ పట్టు చీరలో మేలిమి బంగారు లేసులను వాడినట్లు తెలుస్తోంది. బంగారు లేసులను ఉపయోగించి, దాదాపు 405 గంటల పాటు ఈ చీరను నేయడం జరిగిందని, అందుకు తగ్గట్లుగానే ఈ చీర భారీ ఖరీదు పడింది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కీర్తి సురేష్‌ ధరించిన ఆ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలవడంకు అంతటి కష్టం దాగి ఉంది. అత్యంత ఖరీదైన చీరల్లో ఒక చీరగా ఈ చీరను కీర్తి సురేష్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

కీర్తి సురేష్ చీర మాత్రమే కాకుండా పెళ్లి సందర్భంగా ఆంటోనీ తటిల్ ధరించిన పట్టు వస్త్రం, అంగవస్త్రం ను సైతం ప్రత్యేకంగా నేయడం జరిగిందట. అందుకు గాను 150 గంటల సమయం పట్టిందని, ఆంటోనీ పట్టు వస్త్రాలకూ బంగారు లేసులను వినియోగించినట్లు సమాచారం అందతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా బాగానే సంపాదించింది, ఇక ఆంటోనీ దుబాయిలో మంచి వ్యాపారవేత్త. అందుకే వారు ఖర్చు విషయంలో వెనక్కి తగ్గకుండా లక్షలు ఖర్చు చేసి పెళ్లి బట్టలను నేయించారు.

చీర కట్టులో కీర్తి సురేష్ చాలా అందంగా ఉన్నారు. అంతే కాకుండా చర్చిలో పెళ్లి సందర్భంగా వేసుకున్న వైట్ వెడ్డింగ్ డ్రెస్‌లోనూ కీర్తి సురేష్ అందంగా మెరిసి పోయారు అంటూ సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌ కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌లో బేబీ జాన్‌ సినిమాతో అలరిస్తున్న ఈ అమ్మడు తమిళ్‌ లో మరిన్ని సినిమాలు చేస్తుంది. తెలుగు లో ఈమె సినిమాలు నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అందుకే ఆమె నుంచి కొత్త సినిమాలు రావడం లేదు అంటూ కొందరు అంటున్నారు. ముందు ముందు అయినా ఆమె నుంచి తెలుగు సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడం లేదని, వరుస సినిమాలు చేస్తానంటూ ఆమె ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చింది.