సినిమా హిట్టో..పట్టో కీర్తికి ముందే తెలిసిపోతుంది!
సినిమా విజయం...సాధిస్తుందా? అపజయం సాధిస్తుందా? అన్న దానిపై ఎవరి అభిప్రాయం వారికుంటుంది.
By: Tupaki Desk | 15 May 2024 10:30 AM GMTసినిమా విజయం...సాధిస్తుందా? అపజయం సాధిస్తుందా? అన్న దానిపై ఎవరి అభిప్రాయం వారికుంటుంది. కొన్ని సినిమాలు సెట్స్ లో ఉండగానే ఔట్ పుట్ చూసుకుని హిట్ అవుతుందా? పోతుందా అని చెప్పేవారు లేకపోలేదు. ఈ విషయంలో విక్టరీ వెంకటేష్ ఎక్స్ పర్ట్. కొన్ని సినిమాల ఫలితం తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిన పనిలేదని..షూటింగ్ పూర్తయిన తర్వాతే చెప్పొయోచ్చని ఓ సందర్భంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇదే కోవలో మిగతా హీరోలు ..దర్శకులు కూడా ఫలితం విషయంలో ఓ అంచనాకి వచ్చేస్తారు. కానీ కమిట్ అయిన సినిమాని మధ్యలో వదిలేయలేరు కాబట్టి పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అంతా ఇలాంటి అనుభవాలు చూసిన వాళ్లెంతో మంది. ఇక సినిమా పోయిం దంటే? ఆ ప్రభావం దర్శక-హీరోలపైనే ఎక్కువగా పడుతుంది. ప్రధానంగా విమర్శలు ఎదుర్కోవాల్సింది వాళ్లే.
కొన్ని సందర్భాల్లో ప్లాప్ లు హీరో-దర్శక-నిర్మాతల మధ్య దూరాన్నిసైతం పెంచుతాయి. ఇలాంటి ఘనటలు ఎన్నో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన అంచనాని చెప్పే ప్రయత్నం చేసింది. `మహానటి` షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ అనుభవాలు..పాత్రని మర్చిపోవడం చాలా కాలం పాటు జరగలేదంది. ఆ ఎమోషన్ ఎంతో కాలం వెంటాడింది. ఆ సినిమా కంటే ముందు తర్వాత చాలా సినిమాలు చేసాను. కానీ ఏది అంతగా కనెక్ట్ అవ్వలేదు.
అప్పుడే అనిపించింది సినిమా హిట్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అన్నది ఆ ఎమోషన్ ఆధారంగా కొంతవరకూ గెస్ చేయవచ్చు. ఏ సినిమాలో పాత్రలు బలంగా పండాయంటే ఆ ఎమోషన్ కొంత కాలం పాటు ట్రావెల్ అవుతుంది. షూట్ నుంచి బయటకు వచ్చన తర్వాత కూడా ఎమోషన్ కొనసాగిందంటే ఆసినిమా మంచి ఫలితం సాధిస్తుందని అర్దం. అలాగని ప్రతీ సినిమా విషయంలో ఇలాగే జరగాలనేం లేదు. కొన్నిసార్లు నా అంచనా కూడా తప్పొచ్చు. అలాంటి అనుభవాలు లేకపోలేదు` అనేసింది.