Begin typing your search above and press return to search.

రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్.. గూండాల పని ఖతం!

అయితే కీర్తి బర్త్ డే సందర్భంగా.. రివాల్వర్ రీటా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 6:08 AM GMT
రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్.. గూండాల పని ఖతం!
X

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుని సత్తా చాటుతున్నారు. ఇప్పటికే గుడ్ లక్ సఖి.. మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించారు. రీసెంట్ గా రఘు తాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రివాల్వర్ రీటా మూవీ ఒకటి.

కన్నడ దర్శకుడు చంద్రు తెరకెక్కిస్తుండగా.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 90స్ లుక్ లో రెండు చేతిలో రివాల్వర్స్ పట్టుకుని కీర్తి కనిపించి ఆకట్టుకున్నారు. కౌ బాయ్ తరహాలో డిజైన్ చేసిన పోస్టర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే కీర్తి బర్త్ డే సందర్భంగా.. రివాల్వర్ రీటా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.

సినీ ప్రియులతో పాటు కీర్తి ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది. రివాల్వర్ తో ఆమె ఆటాడుకుంటూ.. గూండాలకు వణుకు పుట్టిస్తూ కీర్తి సురేష్ కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. రివాల్వర్ రీటా మూవీతో మంచి హిట్ అందుకునేలా కనిపిస్తుందని అంటున్నారు. టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉందని చెబుతున్నారు. సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్సుల్లో కీర్తి అదరగొట్టినట్లు టీజర్ చూస్తే తెలుస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

ఓ మార్కెట్లో కీర్తి బ్యాగు వేసుకొని నిల్చున్న సీన్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కారులో ఉన్న గూండాలు ఆమె బ్యాగ్ కొట్టేసి పారిపోతారు. ఆ బ్యాగ్ తెరవగా.. అందులో రివాల్వర్, రక్తంతో ఉన్న కత్తి, హ్యాండ్ గ్రెనేడ్ ఉండడంతో వారంతా షాకవుతారు. ఇంతలో మాస్ ఎంట్రీ ఇస్తారు కీర్తి సురేష్. నువ్వు పోలీసా, రా ఏజెంటా లేక డానా అని వాళ్లు ఆమెను అడగ్గా.. తాను సామాన్లు ముందు ఇవ్వమని చెబుతారు. దీంతో వారు ఇచ్చేస్తారు.

ఆ తర్వాత తన బ్యాగ్ ను తీసుకుని ఇంటికి వెళ్లిపోదామని చూస్తారు కీర్తి. అప్పుడే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. కూరగాయలకు వెళ్లి ఇంత సేపవుతుంది ఎక్కడికి పోయావంటూ తల్లి (రాధిక శరత్ కుమార్) అరుస్తూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని యాక్షన్ సీన్స్ యొక్క షాట్స్ చూపించారు మేకర్స్. సునీల్, అజయ్ ఘోష్ వంటి పలువురు యాక్టర్స్ కూడా సినిమాలో నటిస్తున్నారు. మరి రివాల్వర్ రీటా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో? ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.