ఆ భామలిద్దరి సక్సెస్ ని కళావతి కొనసాగిస్తుందా?
ఇప్పుడీ భామల సక్సెస్ ని కొనసాగించాల్సిన బాధ్యత కీర్తి సురేష్ అలియాస్ కళావతిపై అంతే ఉంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Dec 2023 3:15 AM GMTనయనతార..రష్మిక మందన్నా బాలీవుడ్ డెబ్యూలతో ఇండియానే షేక్ చేసారు. ఇద్దరికీ 'జవాన్'.. 'యానిమల్ ' రూపంలో బెస్ట్ లాంచింగ్ లు దొరికాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ బెల్ట్ లోనూ సత్తా చాటిన భామలుగా ఫేమస్ అవుతున్నారు. ఇకపై బాలీవుడ్ లో ఇద్దరి కెరీర్ కి తిరుగుండదు. ఇప్పటికే అవకాశాలు క్యూ కడుతు న్నాయి. బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వెల్లువ మొదలైంది. తొలి సినిమాతోనే నయన్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రష్మిక అదే నెంబర్ కి అతి చేరువలో ఉంది.
ఇప్పటికే 'యానిమిల్' 800 కోట్ల మార్క్ ని దాటేసింది. మరో 200 కోట్లు సునాయాసంగా చేధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అలా నయన్...రష్మిక పేర్లు నార్త్ లో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇప్పుడీ భామల సక్సెస్ ని కొనసాగించాల్సిన బాధ్యత కీర్తి సురేష్ అలియాస్ కళావతిపై అంతే ఉంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. 'అక్క' అనే వెబ్ సిరీస్ సహా కొన్ని సినిమాలకు సైన్ చేసింది.
మహానటితో నార్త్ లోనే పేమస్ అయిన కీర్తికి ఇది మంచి అవకాశంగా భావించి లాంచ్ అవుతుంది. అక్కలో రాధికా ఆప్టేతో పోటీ పడుతుంది. ఎందులోనూ తక్కువ కాకుండా రాధికని మించిన గొప్ప పెర్పార్మర్ గా నిలవాలని కసిగానే ఉంది. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు సైతం తీసుకుని అమ్మడు బాలీవుడ్ కి వెళ్తుంది. అయితే వీటిని తాను అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అక్కడ ఎక్కడ తేడా జరిగినా మొదటికే ముప్పు వస్తుందన్నది గ్రహించాలి.
ఈ విషయంలో రష్మిక ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. పుష్పతో లాంచ్ అయిన తర్వాత అమ్మడు హిందీ సినిమాలు రిలీజ్ కాకుండానే బాలీవుడ్ మీడియాని అటెన్షన్ డ్రా చేసింది. సోషల్ మీడియాలో తనదైన మార్క్ ఎలివేషన్లతో కుర్రాళ్లని ఆకర్షించి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఆ విషయంలో కీర్తి చాలా వెనుక ఉంది. అమ్మడిప్పుడు హిందీ ఆడియన్స్ లోనూ ముందొస్తుగా క్రేజ్ ని దక్కించుకోలగాలి. మరి ఆ రకమైన చర్యలు తీసుకుంటుందా? అన్నది చూడాలి.