Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ కి YRF టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ ఒకేనా?

బాలీవుడ్ లో కీర్తి సురేష్ వెబ్ సిరీస్ చేస్తున్న విష‌యం దాదాపు క‌న్ప‌మ్ అయిన‌ట్లే . వైఆర్ ఎఫ్ బ్యాన‌ర్ లో ఛాన్స్ ? అంటే ఏ న‌టి వ‌దులుకోదు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:30 PM GMT
కీర్తి సురేష్ కి  YRF  టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ ఒకేనా?
X

బాలీవుడ్ లో కీర్తి సురేష్ వెబ్ సిరీస్ చేస్తున్న విష‌యం దాదాపు క‌న్ప‌మ్ అయిన‌ట్లే . వైఆర్ ఎఫ్ బ్యాన‌ర్ లో ఛాన్స్ ? అంటే ఏ న‌టి వ‌దులుకోదు. అందులోనూ కీర్తి సురేష్ కెరీర్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న స‌మ‌యంలో వచ్చిన అవ‌కాశం కాబ‌ట్టి నో చెప్ప‌డానికి ఛాన్స్ లేదు. విష‌యం అధికారికం ఖ‌రారు కాలేదు గానీ... కీర్తి ఒకే చెప్పిన‌ట్లే తెలుస్తోంది. ఇది టాలీవుడ్ కి షాకింగ్ న్యూస్ అనే అనాలి. వెబ్ సిరీస్ చేస్తుంది? అన్న అంశం ఎక్క‌డా ఇంత‌వ‌ర‌కూ క‌నీసం రూమ‌ర్ గాకూ డా వినిపించ‌లేదు.


ఒక్క‌సారిగా వైఆర్ ఎఫ్ బ్యాన‌ర్ లో కీర్తి న‌టిస్తుంద‌న‌గా? అంతా స‌ర్ ప్రైజ్ అవ్వాల్సిన స‌న్నివేశం. అక్క ఒక `రివేంజ్ థ్రిల్ల‌ర్` గా తెర‌కెక్కుతుంది. మ‌రి ఇందులో కీర్తి పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియాలి. ఎలా ఉన్నా బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో పోటీ ప‌డి న‌టించ‌క‌త‌ప్ప‌దు. అలా మెప్పించ‌క‌పోతే మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం ఉంటుంది. కాబ‌ట్టి కీర్తి సిరీస్ కి సంత‌కం చేసే ముందు అన్ని ర‌కాల నిర్ణ‌యాలు తీసుకునే ఉంటుంద‌ని తెలుస్తుంది.

బాలీవుడ్ వెబ్ సిరీస్ లు అంటే ఎలా ఉంటాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ డిమాండ్ చేసిందంటే రియ‌లిస్టిక్ పెర్పార్మెన్స్ తో మెప్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా బోల్డ్ స‌న్నివేశాల‌కు నో చెప్ప‌డానికి ఉండ‌దు. ద‌ర్శ‌కుడి విజ‌న్ మేర‌కు అన్ని ర‌కాలుగా న‌టి మౌల్డ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో నూ ఇలాంటి సిరీస్ లంటే శృంగార స‌న్నివేశాలు కామ‌న్ గా క‌నిపిస్తున్నాయి. అలాంటి స‌న్నివేశాల తోనే మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నారు.

కంటెంట్ తో పాటు రొమాన్స్ కూడా తోడైతే ఆ క‌థ‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఓ సిరీస్ రాసే ముందు ద‌ర్శ‌కుడు ఇలాంటి ఎ న్నో విష‌యాలు దృష్టిలో పెట్టుకుని ప‌నిచేస్తారు. అందు లోనూ ప్ర‌ఖ్యాత వైఎర్ ఎఫ్ బ్యాన‌ర్ అంటే? అలా న‌టించ‌ను.. ఇలా న‌టించ‌ను అంటే కుద‌ర‌దు. టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ అన్ని చ‌దివిన త‌ర్వాత‌...అవ‌న్నీ ఆమోద‌యోగ్య‌మైతేనే సంత‌కం పెట్ట‌మ‌ని చెబుతారు. మ‌ధ్య‌లో ద‌ర్శకుడికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఆ ర‌కమైన చ‌ర్య‌లు వైఆర్ ఎఫ్ ముందుగానే తీసుకుంటుంది.