Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ పదేళ్ల ప్రస్థానం..!

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన అభినయం ప్రేక్షక హృదయాలను టచ్ చేసింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:09 AM GMT
కీర్తి సురేష్ పదేళ్ల ప్రస్థానం..!
X

మలయాళ భామ కీర్తి సురేష్ మొదటి సినిమా గీతాంజలి నవంబర్ 14, 2013 న రిలీజైంది. అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కీర్తి సురేష్ గీతాంజలి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తెలుగులో నేను శైలజ సినిమాతో తెరంగేట్రం చేసింది అమ్మడు. ఆ సినిమాతో తెలుగు యూత్ ఆడియన్స్ కు ఫేవరెట్ అయ్యింది కీర్తి సురేష్. తన మార్క్ సినిమాలతో కెరీర్ సాగిస్తున్న కీర్తికి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి ఛాన్స్ వచ్చింది.


కీర్తి సురేష్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అంటే అది మహానటి అని కచ్చితంగా చెబుతారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన అభినయం ప్రేక్షక హృదయాలను టచ్ చేసింది. ఆ సినిమాతో కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మహానటి తో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్న కీర్తి సురేష్ వరుస సినిమాలు చేసినా అవన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, స్వామి స్క్వేర్, పందెం కోడి 2 ఇలా సినిమాలన్నీ కూడా ఆమెను నిరాశపరిచాయి.

తన లుక్ విషయంలో మార్పులు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న కీర్తి స్లిమ్ గా మారి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఇక ఆరు ఏడు ఫ్లాపుల తర్వాత చిన్నా సినిమాతో పర్వాలేదు అనిపించిన కీర్తి సురేష్ మహేష్ తో నటించిన సర్కారు వారి పాటతో కమర్షియల్ హిట్ అందుకుంది. స్లిమ్ అవ్వడమే కాదు గ్లామర్ షో విషయంలో కూడా కాస్త ఓకే అన్నట్టుగా కనిపించిన కీర్తి సురేష్ స్కిన్ షోకి సై అనేస్తుంది.

ఇక ఈ ఇయర్ దసరాలో వెన్నెల పాత్రలో మరోసారి తన సత్తా చాటింది కీర్తి సురేష్. మహానటి తర్వాత కీర్తి సురేష్ ప్రతిభ కనబరచిన సినిమా దసరా. అందుకే సినిమా హైలెట్స్ లో వెన్నెల పాత్ర గురించి కూడా చెప్పుకుంటారు. ప్రస్తుతం హోంబలే ప్రొడక్షన్స్ లో రఘు తాత సినిమా చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా ఒక ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. 10 ఏళ్ల సినీ ప్రస్థానం లో ప్రేక్షకుల మనసుల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇదే ఫాం కొనసాగుతూ ఆమె మరో రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించేలా సినిమాలు తీయాలని ఆశిద్దాం. కీర్తి సినీ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె నటించిన సినిమాలన్నిటినీ కలిపి ఒక ఫోటో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.