కీర్తి సురేష్ ప్రియుడు గురించి చెప్పేదెప్పుడు?
లైఫ్ బోర్ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా ఎవ్వరూ ఊహించని సమాధానం చెప్పింది.సింగిల్ అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పలేదుగా అంటూ షాకింగ్ అన్సర్ ఇచ్చింది.
By: Tupaki Desk | 9 Aug 2024 5:35 PM GMTకీర్తి సింగిల్ కాదు..మింగిల్ అయిందా? అమ్మడు రిలేషన్ షిప్ లో ఉందా? ప్రియుడి వివరాలు గోప్యంగా ఉంచుతుందా? అంటే అవుననే టాక్ ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంది. ఓపాడ్ కాస్ట్ లో మీరు సింగిల్ గా ఉంటున్నారు? లైఫ్ బోర్ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా ఎవ్వరూ ఊహించని సమాధానం చెప్పింది.సింగిల్ అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పలేదుగా అంటూ షాకింగ్ అన్సర్ ఇచ్చింది.
దీంతో అంతా ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఆమె రిలేషన్ షిప్ లో ఉందా? అన్నప్రచారం నెట్టింట జోరందుకుంది. రిలేషన్ షిప్ లో ఉంది అన్న విషయాన్ని కీర్తి ఇలా పరోక్షంగా చెప్పిందని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఇంతవరకూ ఏ సందర్భంలోనూ ఇలాంటి సమాధానం చెప్పలేదు. ఇలాంటి విషయాలు అడిగితే సూటిగా అలాంటిదేం లేదని సమాధానం వచ్చేది. లేదంటే స్కిప్ కొట్టేది.
కానీ ఇప్పుడు ఆ రెండిటికీ భిన్నంగా అమ్మడి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. దీంతో ఆమె మింగిల్ అయిన వ్యక్తి ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇటీవలే కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందే అమ్మడు ప్రోఫెషనల్ గా అప్ డేట్ అయింది. మునుపటిలా మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావని భావించిన అమ్మడు గ్లామర్ షో ఛాన్స్ తీసుకుంది.
స్కిన్ షో సహా డిజైనర్ దుస్తుల్లో మురిపించడం మొదలు పెట్టింది. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత మరింత అప్ డేట్ అయింది. ఇప్పుడు సింగిల్ కాదంటూ చెప్పడం తో కీర్తి లో మార్పులు స్పష్టంగా గమనించొచ్చు. ఇక కీర్తి ఈనెల 15 న`రఘుతాత` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికిరెడీ అవుతోంది. అలాగే `బేబి జాన్` తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.