నొప్పి భరించలేనంటూ ఎంతో బాధపడింది! కీర్తి సురేష్
నా చిన్ననాటి స్నేహితురాలు ఇంత త్వరగా నన్ను విడిచి వెళ్లిపోతుందనుకోలేదు.
By: Tupaki Desk | 4 Aug 2024 7:08 AM GMTనటి కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాల్ని కోల్పోయిన బాధలో ఉన్నట్లు వెల్లడిచింది. 21 ఏళ్ల వయసులోనే మనిషా అనే స్నేహితురాలు మరణించి నెలరోజులవుతున్నా? కీర్తి సురేష్ ఇంకా ఆబాధ నుంచి తేరుకోలేదు. తాజాగా స్నేహితురాలి మరణించే ముందు ఎంతటి బాధని అనుభవించిందో చెప్పి మరింత శోకానికి గురైంది. `గడిచిన రోజులు ఎంతో కష్టతనమైనవి. నా చిన్ననాటి స్నేహితురాలు ఇంత త్వరగా నన్ను విడిచి వెళ్లిపోతుందనుకోలేదు.
21 ఏళ్లకే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దాంతో ఎనిమిదేళ్లు పోరాటం చేసింది. తనలా ధైర్యంగా పోరాడేవారిని ఇంతవరకూ చూడలేదు. గత నవంబర్ లో మూడవసారి సర్జరీ జరిగింది. ఆ తర్వాత నొప్పి భరించలేకపోతున్నానంటూ నా ముందు ఏడ్చేసింది. అదే తనతో నాకున్న చివరి జ్ఞాపకం. తన ముందు నా ఎమోషన్ ఆపుకునే ప్రయత్నం చేసాను. కానీ నావల్ల కాక బయటకు వచ్చి ఏడ్చేసాను. హాస్పిటల్ లో కళ్లజోడు...మాస్క్ కింద కన్నీటిని కప్పేసాను.
చివరిగా కోమాలోకి వెళ్లినప్పుడు చూసాను. ఇంకా సొంత జీవితాన్ని ప్రారంభించలేదు. ప్రపంచాన్ని చూడలేదు. ఎన్నో కలలు కంది. అవి అలాగే మిగిలిపోయాయి. చిన్న వయసులోనే తనకి ఎందుకిలా జరిగిందో? ఆ దేవుడికే తెలియాలి. కొన్నిజీవితాలు మధ్యలోనే ముగిసిపోతాయి అన్నది ఎప్పుటూ వింటాను. అది నా స్నేహితురాలు జీవితంలోనూ చోటు చేసుకుంది.
వ్యాధి తీవ్రతరం కావడంతో చనిపోయింది. కానీ తాను చివరి వరకూ చేసిన పోరాటం స్పూర్తి ని నింపింది. ఇది జరిగి నెలరోజులవుతున్నా ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తనని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను` అని రాసుకొచ్చింది.