Begin typing your search above and press return to search.

కీర్తి ఇలా సైలెంట్ గా పేల్చేస్తే ఎలా?

తాజాగా కొత్త సినిమాని సైలెంట్ గా లాంచ్ చేయ‌డంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు

By:  Tupaki Desk   |   16 July 2023 8:18 AM GMT
కీర్తి ఇలా సైలెంట్ గా పేల్చేస్తే ఎలా?
X

కీర్తి సురేష్ ఫుల్ జోష్ లో ఉందా? కొత్త సినిమాల జోరు పెంచిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. హీరోయిన్ గానే కాకుండా స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌కు సైతం సై అన‌డంతో బిజీ న‌టిగా మారిపోతుంది. వాస్త‌వానికి గ‌తేడాది నుంచే అమ్మ‌డి కెరీర్ స్పీడ్ అందుకున్నా స‌క్సెస్ లు మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. నెంబ‌ర్ ప‌రంగా సినిమాలు క‌నిపిస్తున్నాయి త‌ప్ప‌! స‌క్సెస్ ని భూత‌ద్దం పెట్టి వెత‌కాల్సిన స‌న్నివేశమే.

అయినా స‌రే కీర్తి వేగం మాత్రం త‌గ్గ‌లేదు. 2023లోనూ అదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌స్తుతం కీర్త చేతిలో తెలుగు..త‌మిళ్ లో క‌లిపి నాలుగైదు సినిమాలున్నాయి. కొన్ని స్టోరీల విని ఒకే చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమాని లాంచ్ చేసి స‌ర్ ప్రైజ్ చేసింది.

అవును డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్లో తెలుగు..త‌మిళ భాష‌ల్లో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా నిన్న చెన్నైలో ప్రారంభ‌మైంది. గణేష్ రాజ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

ఇదొక వినూత్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ట్విస్టులు..ట‌ర్నింగ్ లే సినిమాలు హైలైట్ అట‌. టెక్నిక‌ల్ గా సినిమాని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్న‌ట్లు యూనిట్ తెలిపింది. ఈ సినిమా ఛాన్స్ తో మ‌హాన‌టి ఇంపాక్ట్ నిర్మాత‌ల్లో ఇంకా బలంగానే ఉంద‌ని తెలుస్తోంది.

ఈ సక్సెస్ త‌ర్వాత గ్లామ‌ర్ పాత్ర‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ న‌టించ‌లేదు. సెల‌క్టివ్ గా కొన్ని సినిమాలే చేసింది. ఈ నేప‌థ్యంలో 'గుడ్ ల‌క్ స‌ఖి' లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేసింది.

అలాగే త‌మిళ్ లో అమ్మ‌డిని మెయిన్ లీడ్ లో పెట్టి ఓ రా అండ్ ర‌స్టిక్ సినిమా కూడా చేసారు. కానీ ఇవేవి కీర్తిని విజ‌య‌ప‌థంలో నిల‌ప‌లేదు. ఇదే క్ర‌మంలో హీరోయిన్ అవ‌కాశాలు తగ్గాయి. దీంతో అమ్మ‌డు గ్లామ‌ర్ గా క‌నిపించ‌డం మొద‌లు పెట్టింది.

ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఛాన్సులు పెరుగుతున్నాయి. తాజాగా కొత్త సినిమాని సైలెంట్ గా లాంచ్ చేయ‌డంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత‌వ‌ర‌కూ క‌నీసం గాసిప్ కూడా తెర‌పైకి రాలేదు. నేరుగా సినిమా మొద‌లు పెట్టి షాకిచ్చింది.