Begin typing your search above and press return to search.

మహానటి కాస్త ఆలోచించుకోమ్మా..?

చెప్పుకోవడానికి ఇండియన్ సినిమా.. పాన్ ఇండియా క్రేజ్ అనేవి బాగుంటాయి కానీ లోపల ఫ్యాన్ వార్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి

By:  Tupaki Desk   |   5 Aug 2024 11:30 AM GMT
మహానటి కాస్త ఆలోచించుకోమ్మా..?
X

చెప్పుకోవడానికి ఇండియన్ సినిమా.. పాన్ ఇండియా క్రేజ్ అనేవి బాగుంటాయి కానీ లోపల ఫ్యాన్ వార్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల గురించి కోలీవుడ్ ఫ్యాన్స్.. అక్కడ హీరోల గురించి మన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఏదైనా సందర్భం దొరికింది అంటే వీళ్లు మరింత రెచ్చిపోతుంటారు. రీసెంట్ గా కీర్తి సురేష్ చిరంజీవి, విజయ్ లలో బెస్ట్ డాన్సర్ గా తన ఇష్టాన్ని చెప్పమంటే విజయ్ పేరు చెప్పింది. అంతే అక్కడ నుంచి అసలు గొడవ మొదలైంది.

చిరంజీవి చేసేంత డాన్స్ లో దళపతి విజయ్ ఏమాత్రం చేస్తాడంటూ మెగా ఫ్యాన్స్ ఎటాక్ ఒక రేంజ్ లో ఉంది. దానికి తగినట్టుగానే దళపతి ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కామెంట్స్ ని ఆమె పర్సనల్ ఒపీనియన్ గా చూసి వదిలేస్తే బాగుండేది ఐతే కీర్తి సురేష్ అటు తమిళ్ ఇటు తెలుగు రెండు చోట్ల సినిమాలు చేస్తుంది. చిరంజీవి, విజయ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే ఆమె ఇద్దరు అనో లేదా దీనికి సమాధానం చెప్పడం కష్టమనో తప్పించుకుంటే బాగుండేది.

కానీ అలా కాకుండా విజయ్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. ఐతే రెండు భాషల్లో నటిస్తూ అక్కడ ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ లాంటి భామలు ఇలాంటి కామెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి డాన్స్ గురించి ఆమెకు ఏం తెలుసని అలా అనేస్తుందని మెగా ఫ్యాన్స్ వెర్షన్.. మరోపక్క దళపతి విజయ్ కూడా తక్కువవాడేమి కాదు. కానీ ఇద్దరు స్టార్స్ గురించి అడిగినప్పుడు వారికి రెస్పెక్ట్ ఇస్తూ క్వశ్చన్ స్కిప్ చేస్తే ఏ గొడవ లేకుండా ఉండేది.

కీర్తి ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ వల్ల మెగా ఫ్యాన్స్ ఆమె మీద కూడా విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అసలు ఇష్యూ ఇలా టర్న్ అవుతుందని కీర్తి సురేష్ ఊహించి ఉండదు. ఆమె తన అభిప్రాయం చెప్పడంలో సందేహం లేదు కానీ ఇద్దరు స్టార్స్ గురించి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేముందు కాస్త తెలివి ప్రదర్శిస్తే ఇవాళ ఈ అనవసరమైన హడావుడి ఉండేది కాదని చెప్పొచ్చు.