కీర్తి.. అక్కడ గ్లామర్ హీటుకు ఎంత మార్పో..
సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 July 2024 4:56 AM GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటోందట. నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. మొదటి మూవీతోనే యూత్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. నానితో నేను లోకల్ మూవీ చేసి ఊహించని రేంజ్ లో హిట్ కొట్టేసింది.
ఆ తర్వాత పవన్ అజ్ఞాతవాసి మూవీలో నటించినా ఆ సినిమా మెప్పించలేకపోయింది. అదే ఏడాది మహానటిలో అద్భుతంగా నటించి నేషనల్ అవార్డు అందుకుంది. మహానటి తర్వాత బ్యూటీ కెరీర్ మారిపోయింది. రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది నాని దసరాతో సరైన హిట్ అందుకుంది. చిరంజీవి భోళా శంకర్ లో ఆయనకు చెల్లెలుగా నటించింది. 2024లో సైరన్ తో వచ్చిన అమ్మడు.. కల్కి సినిమాలో కూడా భాగమైంది.
ఇప్పుడు కోలీవుడ్ లో మూడు చిత్రాలతో పాటు బాలీవుడ్ లో తెరి రీమేక్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అయినా.. గ్లామర్ లో మాత్రం ఎప్పుడు హద్దు దాటలేదు. కానీ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. మెల్ల మెల్లగా పెంచుతోంది కూడా. సోషల్ మీడియాలో హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. తెరి రీమేక్ (బేబీ జాన్) షూటింగ్ సెట్స్ నుంచి కీర్తి పిక్స్ లీక్ అవ్వగా.. అందులో క్లీవేజ్ షోతో షాక్ చేసింది.
ఇక ఆమె నటిస్తున్న రఘ తాత మూవీ ప్రమోషనల్ ఈవెంట్ రీసెంట్ గా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు వచ్చిన కీర్తి డ్రెస్సింగ్ చూసి అంతా అవాక్కయ్యారు. ఫ్లోరల్ శారీ, బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకుని వచ్చిన అమ్మడు అందరినీ ఫిదా చేసింది. స్కిన్ షోతోపాటు ఎద అందాలతో కూడా కవ్వించింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. అమ్మడు ఫుల్ ఛేంజ్ అయిందని అంటున్నారు.
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే.. కీర్తి సురేష్ డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. క్లీవేజ్ షోతో అదరగొడుతోందని అంటున్నారు. కొత్తగా కనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్ డెబ్యూలో వరుణ్ సందేశ్ సరసన అదరగొట్టడం పక్కా అని జోస్యం చెబుతున్నారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక.. అమ్మడి క్రేజ్ ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా డ్రెస్సింగ్ లో కాదు.. మరి అప్ కమింగ్ మూవీస్ లో అమ్మడు గ్లామరస్ కనిపిస్తుందో లేదో చూడాలి.