Begin typing your search above and press return to search.

సినిమా వస్తున్నా.. సౌండ్ లేదేంటి కీర్తి?

గత ఏడాది తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాలతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 9:47 AM GMT
సినిమా వస్తున్నా.. సౌండ్ లేదేంటి కీర్తి?
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ పెంచుకుంటున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులో సినిమాలు తగ్గితే తమిళంలో బిజీగా కనిపిస్తోంది. అక్కడ మూవీస్ లేకపోతే మాతృభాష మలయాళంలో సందడి చేస్తోంది. ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా కీర్తి సురేష్ అడుగుపెడుతోంది. ఆ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా కీర్తి సురేష్ మారిపోతుందనే మాట వినిపిస్తోంది.

గత ఏడాది తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాలతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దసరా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా తెరకెక్కిన ఉప్పుకప్పురంబు అనే చిన్న సినిమాలో కీర్తి సురేష్ నటించింది. తెలుగులో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవు. తమిళంలో మాత్రం మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో రఘు తాత అనే మూవీ ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరెక్కింది. కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ కూడా మూవీ ప్రమోషన్స్ అగ్రెసివ్ గానే చేసింది. అయితే ఆగష్టు 15న చియాన్ విక్రమ్ పాన్ ఇండియా మూవీ తంగలాన్ రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ ఆడియన్స్ ఫోకస్ అంతా కూడా ఈ చిత్రం మీదనే ఉంది. పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం, అలాగే విక్రమ్ భిన్నమైన పాత్రలో కనిపించడంతో తంగలాన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో కోలీవుడ్ లో పబ్లిక్ అటెన్షన్ మేగ్జిమమ్ తంగలాన్ మీద ఉంది. అలాగే 2015లో వచ్చిన సూపర్ హిట్ మూవీ డిమోంటే కాలనీ సీక్వెల్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో డిమోంటే కాలనీ 2 టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ సినిమాకి కోలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

ఈ రెండు సినిమాల కారణంగా రఘు తాత సినిమాని ఎవ్వరు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. రిలీజ్ అయిన బాగుందనే మౌత్ టాక్ వస్తేనే తప్ప ఈ సినిమాకి ప్రేక్షకాదరణ పెరిగే ఛాన్స్ లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తంగలాన్ సినిమాకి వచ్చే టాక్ బట్టి కూడా రఘు తాత రిజల్ట్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ థియేటర్స్ లో వర్క్ అవుట్ కాకుంటే ఓటీటీలో ప్రేక్షకులు రఘు తాత మూవీ చూసుకోవాల్సిందే అనే మాట వినిపిస్తోంది