Begin typing your search above and press return to search.

కీర్తి డబుల్ రెమ్యూనరేషన్.. మరి ఆమాత్రం లేకపోతే ఎలా..?

సౌత్ లో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ కీర్తి సురేష్ తన అభినయంతో సౌత్ ఆడియన్స్ అందరినీ కట్టి పడేస్తుంది

By:  Tupaki Desk   |   31 May 2024 4:30 PM GMT
కీర్తి డబుల్ రెమ్యూనరేషన్.. మరి ఆమాత్రం లేకపోతే ఎలా..?
X

సౌత్ లో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ కీర్తి సురేష్ తన అభినయంతో సౌత్ ఆడియన్స్ అందరినీ కట్టి పడేస్తుంది. అయితే కేవలం నటిస్తే సరిపోదు గ్లామర్ సైడ్ కూడా మెప్పించాలని నిర్ణయించుకున్న కీర్తి సురేష్ ఈమధ్య గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. ఫోటో షూట్స్ తోనే కాదు రాబోయే సినిమాల్లో కీర్తి సురేష్ బోల్డ్ అటెంప్ట్ చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కీర్తి సురేష్ కి ఛాన్స్ రాగా అందుకు తగినట్టుగా అమ్మడు కష్టపడుతుందని తెలుస్తుంది. వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమాలో బీ టౌన్ ఛాన్స్ అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలో రెచ్చిపోయి నటిస్తుంది.

సినిమా కోసం ఆల్రెడీ లిప్ లాక్ సీన్ కు సై అన్నదని మీడియా కోడై కూస్తుంది. కీర్తి సురేష్ ని ఎలా కన్విన్స్ చేసి ఈ సీన్స్ కి ఒప్పించారు అన్నది ఎవరికి అర్ధం కాలేదు. హీరోయిన్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో కీర్తి సురేష్ అందుకు సై అన్నదని చెబుతున్నారు కానీ కీర్తికి డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందని అంటున్నారు. కీర్తి సురేష్ సౌత్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఆమెకు ఇక్కడ 3 నుంచి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారు.

అయితే బాలీవుడ్ లో ఆఫర్ రాగానే కీర్తి సురేష్ ఆలోచించిందట.. అయితే అమ్మడికి రెమ్యునరేషన్ డబుల్ ఆఫర్ చేయడంతో కాదనలేకపోయిందని టాక్. బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ 6 నుంచి 8 కోట్ల దాకా పారితోషికం అందుకుందని అందుకే ఆ సినిమా కోసం డైరెక్టర్ ఎలా అడిగితే అలా రెచ్చిపోయిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియదు కానీ కీర్తి సురేష్ ని సౌత్ సినిమాల్లో చూసి ఇష్టపడిన ఆమె ఫ్యాన్స్ మహానటి ముద్దులతో రెచ్చిపోవడం చూసి తట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరు ఏదో ఒక విధంగా తమ పంథా కొనసాగిస్తున్నారు. కీర్తి తన నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తుంది. ఐతే బాలీవుడ్ లో కూడా అలా కేవలం అభినయం మాత్రమే కాకుండా గ్లామర్ టచ్ ఇస్తూ సత్తా చాటబోతుంది అమ్మడు. కీర్తి తీసుకున్న ఈ డెసిషన్ ఆమెకు కెరీర్ పరంగా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్నది చూడాలి. తెలుగులో దసరా తర్వాత మరో ఛాన్స్ అందుకోని కీర్తి సురేష్ ప్రభాస్ సందీప్ వంగ కాంబో సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తుందని అంటున్నారు.