Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం ఓపెన్ అయిపోయిన హీరోయిన్!

తాజాగా అమ్మ‌డు మ‌న‌సులో దాచుకున్న‌మ‌రో కోరిక పై కూడా ఓపెన్ అయింది. త‌ల అజిత్ స‌ర‌స‌న ఓ సినిమా చేయాల‌ని ఉంద‌నే విష‌యాన్ని చెప్పింది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 11:30 PM GMT
ఆ హీరో కోసం ఓపెన్ అయిపోయిన హీరోయిన్!
X

కీర్తి సురేష్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న‌ సంగతి తెలిసిందే. క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌తో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల జోరు పెంచింది. ఇటీవ‌లే బాలీవుడ్ కి కూడా ప్ర‌మోట్ అయింది. సినిమాల‌తో పాటు అక్క‌డ వెబ్ సిరీస్ లు చేస్తోంది. కీర్తి కెరీర్ అయిపోయిందని విమ‌ర్శ‌లొచ్చిన వేళ స‌రైన అవకాశాలు అందుకుని ఒక్క‌సారిగా స్పీడ‌ప్ అయింది. అయితే అందుకు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకోవ‌డంలోనే ఏమాత్రం ఆలోచించ‌లేదు.

అంత‌వ‌ర‌కూ గ్లామ‌ర్ పాత్ర‌ల విష‌యంలో మ‌డి క‌ట్టుకుని కూర్చుని ఉన్న భామ ఒక్క‌సారిగా గ్లామ‌ర్ గేట్లు తెరిచేసింది. దీంతో బాలీవుడ్ పిలిచి మ‌రీ వెబ్ సిరీస్ అవ‌కాశాలు క‌ల్పించింది. తాజాగా అమ్మ‌డు మ‌న‌సులో దాచుకున్న‌మ‌రో కోరిక పై కూడా ఓపెన్ అయింది. త‌ల అజిత్ స‌ర‌స‌న ఓ సినిమా చేయాల‌ని ఉంద‌నే విష‌యాన్ని చెప్పింది. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకుంటుందిట‌.

చ‌దువుకుంటున్న రోజుల్ని నుంచి అజిత్ సినిమా ఓ క‌ల‌గా భావిస్తున్న‌ట్లు తెలిపింది. ఆ ఛాన్స్ వ‌స్తే క‌థ‌తో సంబంధం లేకుండా ఎస్ చెబుతానంటోంది. అవ‌కాశం కోసం ఎవ‌రైనా రిక‌మండీష‌న్ అయినా చేయోచ్చు అంది. అమ్మ‌డు తీరు చూస్తే! అనుష్క గుర్తొస్తుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ తో ఛాన్స్ కోసం అనుష్క కూడా ఇలా ప్రాదేయ ప‌డింది. హీరోలంద‌రితో న‌టించాను. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో న‌టించ‌లేదు.

ఆ ఛాన్స్ రాలేదు. మీరైనా చెప్పండి? అంటూ మీడియాని అభ్య‌ర్దించింది. మ‌ళ్లీ ఇప్పుడు కీర్తి అజిత్ కోసం అలాగే అభ్య‌ర్ధిస్తుంది. ఇప్ప‌టికే కీర్తి సురేష్ కోలీవుడ్ హీరోలు విజ‌య్, విశాల్, ధ‌నుష్‌, శివ కార్తికేయ‌న్ సినిమాల్లో న‌టించింది. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో సైతం ఆయ‌న‌కు చెల్లెలి పాత్ర పోషించింది. కానీ అజిత్ తో రొమాన్స్ ఛాన్సే ఇంకా రాలేదు.