అనిరుద్ తో కీర్తి సురేష్ పెళ్లి! నాన్న ఏమన్నారంటే?
ఈ నేథ్యంలో తాజాగా ఈ ప్రచారాన్ని కీర్తి సురేష్ తండ్రి..నిర్మాత..నటుడు సురేష్ కుమార్ ఖండిచారు.
By: Tupaki Desk | 17 Sep 2023 6:03 AM GMTమ్యూజిక్ సంచలనం అనిరుద్- హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లగా మీడియా కథనాలు వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు..వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇద్దరు ఒకర్ని ఒకరు గాఢంగా హత్తుకుని దిగిన ఫోటోలతోనే నెట్టింట ఈ కాక మొదలైంది. ఎంత స్నేహితులైతే మరీ ఇంత సన్నిహితంగా ఉంటారా? ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధంద ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో ఆ జంట ఏడాది చివరినాటికి పెళ్లి కూడా చేసుకుంటుందని కోలీవుడ్ మీడియాలో వాడి వేడి చర్చ సాగింది. అనిరుద్ మ్యూజిక్ ని ఇష్టపడినట్లే కీర్తి యువ సంచలనం తన మనసులో స్థానం ఇంచ్చింద ని 'జైలర్' రిలీజ్ అనంతరం పెద్ద చర్చ సాగింది. ఈ నేథ్యంలో తాజాగా ఈ ప్రచారాన్ని కీర్తి సురేష్ తండ్రి..నిర్మాత..నటుడు సురేష్ కుమార్ ఖండిచారు.
'అందులో ఎలాంటి నిజం లేదు. మీడియాలో వస్తోన్న కథనాల్ని అవాస్తవం. కీర్తిపై ఇలాంటి వార్తలు రావడం కొత్తేం కాదు. గతంలో కొంత మంది నటులతో ముడిపెట్టి మాట్లాడారు. అప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ కానీ ఈసారి ఆ వార్తలు పతాక స్థాయికి చేరడంతోనే స్పందించాల్సి వస్తోంది. దయచేసి అవాస్తవాలు ప్రచురించొద్దు' అని కోరారు. అలాగే కీర్తి తల్లి మేనక కూడా అప్పట్లో మాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మేనక చిన్న నాటి స్నేహితురాలు కుమారుడైన వ్యాపార వేత్తని వివాహం చేసుకుంటున్నారని కూడా ప్రచారం సాగింది. ఈ ప్రచారం కూడా చాలా కాలం పాటు సాగింది. అయితే వీటిని కూడా మేనక ఓ సందర్భంలో ఖండించారు. తనయ పెళ్లి విషయంలో అవాస్తవాలు రాయోద్దని వేడుకున్నారు.
దీంతో కీర్త సురేష్ ప్రేమ-పెళ్లి విషయంలో వస్తోన్న మీడియా కథనాలకి నేరుగా తల్లిదండ్రులే బ్రేకులు వేయడంతో ఇవన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటిగా బిజీగా కొనసాగుతుంది. తెలుగు..తమిళ సినిమాలు చేస్తోంది.