Begin typing your search above and press return to search.

తమిళ్ ఆడియెన్స్ vs తెలుగు ఆడియెన్స్.. ఇప్పటికైనా ఒప్పుకున్నారు

కోలీవుడ్ సినిమాలని, అక్కడి హీరోలని తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి అభిమానిస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2024 10:33 AM GMT
తమిళ్ ఆడియెన్స్ vs తెలుగు ఆడియెన్స్.. ఇప్పటికైనా ఒప్పుకున్నారు
X

కోలీవుడ్ సినిమాలని, అక్కడి హీరోలని తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి అభిమానిస్తూ వస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ని కలిగి ఉన్నారు. అందుకే వారి సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలైనా భాషా, ముత్తు, అరుణాచల, నరసింహ, శివాజీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అలాగే కమల్ హాసన్ ని తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ లభించాయి. వారి తర్వాత సూర్య, విక్రమ్, కార్తీ, విజయ్, అజిత్, విశాల్ లాంటి స్టార్స్ తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వారి సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. సూర్య గజినీ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికి ఈ హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ అందుకుంటాయి.

దానికి కారణం తమిళనాట వారికి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో తెలుగులో కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే. ఈ హీరోలు కూడా తెలుగు రాష్ట్రాలలో తమ సినిమాలని విస్తృతంగా ప్రచారం చేస్తారు. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ భారతీయుడు 2గా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అయితే తమిళ్ స్టార్స్ ని మా అభిమాన హీరో ని తెలుగు ప్రేక్షకులు లైక్ చేసినట్లు తమిళ్ ఆడియన్స్ తెలుగు హీరోలని అనుకోరు.

తెలుగు హీరోల నుంచి ఎంత పెద్ద సినిమా వచ్చిన తమిళంలో పెద్దగా ప్రభావం చూపించదు. తెలుగు హీరో సినిమా అని తమిళ్ ఆడియన్స్ అంత ఈజీగా యాక్సప్ట్ చేయరు. బాగుందనే టాక్ వచ్చిన చూడటానికి ఇష్టపడరు. తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలకి తమిళంలో అంతంత మాత్రమే ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ బడా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ్ హీరోలలో చాలా మందిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకొని మా హీరో అని అభిమానించి సినిమాలు చూస్తారు.

అయితే తమిళ్ ఆడియన్స్ మాత్రం తెలుగు స్టార్స్ ని ఎప్పుడు అలా చూడలేదు. బయటి హీరోలుగానే చూస్తున్నారు. కోలీవుడ్ హీరోలకి తెలుగులో లభించినంత ఆదరణ తెలుగు హీరోలకి తమిళంలో లభించడం లేదని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికైనా ఒక తమిళ్ నిర్మాత నిజం ఒప్పుకున్నారు అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమిళ్ సినీ అభిమానులు మాత్రం జ్ఞానవేల్ రాజా వ్యాఖ్యలని తప్పు పడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఏ స్థాయి వరకు వైరల్ అవుతాయనేది చూడాలి.