Begin typing your search above and press return to search.

వోగ్ వందేళ్ల ఉత్స‌వంలో కిల్ల‌ర్ బ్యూటీ

ప్ర‌ఖ్యాత వోగ్ మ్యాగ‌జైన్ 100 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్ హాట్ టాపిక్ గా మారాయి. మ్యాగ‌జైన్ వ‌రుస‌ క‌వ‌ర్ షూట్లు ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   28 Jun 2024 2:49 PM GMT
వోగ్ వందేళ్ల ఉత్స‌వంలో కిల్ల‌ర్ బ్యూటీ
X

ప్ర‌ఖ్యాత వోగ్ మ్యాగ‌జైన్ 100 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్ హాట్ టాపిక్ గా మారాయి. మ్యాగ‌జైన్ వ‌రుస‌ క‌వ‌ర్ షూట్లు ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వోగ్ వరల్డ్ సిటీ స్క్వేర్‌ను స్వాధీనం చేసుకుని దానిని రన్‌వేగా మార్చడంతో గాయకులు, సూపర్ మోడల్స్, క్రీడాకారిణులు పారిస్‌లో దిగారు. ఫ్యాషన్ మ్యాగజైన్ 100 సంవత్సరాల ఫ్రెంచ్ ఫ్యాషన్ వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి చారిత్రాత్మక ప్లేస్ వెండోమ్‌ను క్యాట్‌వాక్ డెస్టినీగా మార్చింది.

1920ల నుండి నేటి వరకు ఫ్యాషన్ ప‌రంగా ప్రతి దశాబ్దానికి భిన్నమైన క్రీడను నేపథ్యంగా ఉపయోగించి ఫోటోషూట్లు చేయ‌డం ఈ షో ప్ర‌త్యేక‌త‌. రాజధాని నగరం ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక నెల ముందు ఈ ఈవెంట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ ప్రదర్శనలో 151 మందికి పైగా మోడల్స్, 188 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఇలాంటి ఒక గొప్ప వేదిక‌పై పాపుల‌ర్ మోడ‌ల్ కం న‌టి, ఎంట‌ర్ ప్రెన్యూర్ కెండ‌ల్ జెన్న‌ర్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డింది. ఫ్యాష‌న్ కి కేర‌ఫ్ అడ్రెస్ గా నిలిచే ఈ బ్యూటీ ర్యాంప్ పై క్యాట్ వాక్ ల‌తో అద‌ర‌గొట్టింది. కెండాల్ జెన్న‌ర్ అంద‌చందాలు ఈ వేడుక‌లో యువ‌త‌రం మన‌సులు దోచాయి. FRWD పారిస్ కోచర్ వీక్ వేడుకలో కెండాల్ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్స్ తో మ‌తులు చెడ‌గొట్టింది.

సూపర్ మోడల్-కమ్-క్రియేటివ్ డైరెక్టర్-కమ్ లిక్కర్ వ్యవస్థాపకురాలైన కెండాల్ వోగ్ వ‌ర‌ల్డ్ ఫ్యారిస్ వేడుక‌ కోసం టెయ‌నా టేల‌ర్, సెయింట్ జాన్ సహా స్నేహితుల బృందంతో క‌లిసి వ‌చ్చారు. అబ్బురపరిచే ఈవెంట్ నుంచి సెల‌బ్రిటీల ర్యాంప్ వాక్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.