Begin typing your search above and press return to search.

'కేసీఆర్' స‌ర‌స‌న ఫేమ‌స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కుమార్తె!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ స‌త్య‌కృష్ణ‌న్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించు కుంది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 11:49 AM GMT
కేసీఆర్ స‌ర‌స‌న ఫేమ‌స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కుమార్తె!
X

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ స‌త్య‌కృష్ణ‌న్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించు కుంది. దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. `ఆనంద్`,` బొమ్మరిల్లు`, `సామాన్యుడు`, `రెడీ`, `దూకుడు`,` బాద్ షా`, `గోవిందుడు అందరివాడేలే`, `ఆడవాళ్లు మీకు జోహర్లు`, `మెంట‌ల్ కృష్ణ‌` ఇలా ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఇటీవలే ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన `సేవ్ ది టైగర్స్` వెబ్ సిరీస్ లోనూ నటించింది.

ముఖ్యంగా ఆమె వాయిస్ లో ఉన్న బేస్ కి ఫాలోయింగ్ మామూలుగా లేదు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడామెకు న‌టిగా అవ‌కాశాలు త‌గ్గాయి. మునుప‌టిలా సినిమాలు చేయ‌డం లేదు. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో స‌త్య‌కృష్ణ‌న్ ఆమె కుమార్తెని రంగంలోకి దించుతుంది. ఆమె పేరు అన‌న్య కృష్ణ‌న్. అయితే ఇప్ప‌టికే న‌టిగా తెరంగేట్రం చేసింది. `గ్యాంగ్ స్టర్ గంగరాజు` , `ఊ అంటావా మావ ఊహు అంటావా మావ` అనే సినిమాలో కనిపించింది. కానీ హీరోయిన్ గా మాత్రం చేయ‌లేదు.

తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. `జబర్దస్థ్` క‌మెడియ‌న్ రాకేష్ హీరోగా న‌టిస్తోన్న `కేసీఆర్` చిత్రంలో అన‌న్యా హీరోయిన్ గా చేస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే మామ్ హీరోయిన్ కాలేన‌ప్ప‌టికీ కుమార్తెను మాత్రం హీరోయిన్ ని చేస్తోంది. త‌ల్లిదండ్రులు సాధించ‌లేని ల‌క్ష్యాల‌ను పిల్ల‌ల రూపంలో చేధించే దిశ‌గా మంచి గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ల‌డం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యం.

ఆ ర‌కంగా అన‌న్య కృష్ణ‌న్ కి మంచి బ్యాక‌ప్ దొరికింది. మ‌రి ఈ సినిమా ద్వారా అన‌న్య ఎంత వ‌ర‌కూ రాణిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో అనన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మామ్ క్రేజ్ కూడా కుమార్తెకు క‌లిసొస్తుంది. స‌త్య‌కృష్ణ‌న్ కుమార్తె అని అంతా ముచ్చ‌టించుకుంటున్నారు.