Begin typing your search above and press return to search.

బీచ్ లో కేతిక.. గుర్రంపై సెగలు రేపేలా..

బీచ్ లో అందాల ఆరబోత గ్లింప్స్ ను షేర్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పొట్టి బట్టలతో కేతిక శర్మ వేరే లెవెల్ లో ఉన్నారనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 4:00 AM GMT
బీచ్ లో కేతిక.. గుర్రంపై సెగలు రేపేలా..
X

ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ.. అందం అభినయం కావాల్సినంత ఉన్నా ఈ అమ్మడికి అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి. తన క్యూట్ లుక్స్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోతుందనుకున్నా.. అలా జరగలేదు. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మ.. త్వరలో ఐటమ్ గర్ల్ గా కనిపించనున్నారు. మరో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కేతిక.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పేరెంట్స్ ఆమెను డాక్టర్ చేద్దామనుకున్నా.. కేతిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ డెబ్యూ మూవీ రొమాంటిక్ తో హీరోయిన్ గా మారారు. ఫస్ట్ సినిమాతో హిట్ అందుకోకపోయినా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత నాగశౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా... అనుకున్న స్థాయిలో హిట్లు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. భారీ మల్టీస్టారర్ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారుతారని అంతా అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో కనిపించలేదు.

ఇప్పుడు చాలా రోజుల తర్వాత రాబిన్ హుడ్ లో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ వేరే లెవెల్ లో ఉంది. యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. మెల్లగా బిజీగా మారినట్లు తెలుస్తోంది. మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. అయితే నేడు ఆమె బర్త్ డే కాగా.. అంతా విషెస్ చెబుతున్నారు.

అదే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హీట్ పుట్టించే క్లిక్స్ తో సందడి చేసే కేతిక.. నేడు తన ఫాలోవర్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. అదిరిపోయే చిన్న వీడియో పోస్ట్ చేశారు ముద్దుగుమ్మ. బీచ్ లో అందాల ఆరబోత గ్లింప్స్ ను షేర్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పొట్టి బట్టలతో కేతిక శర్మ వేరే లెవెల్ లో ఉన్నారనే చెప్పాలి. తన వయ్యారానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు.

తడిసిన అందాలతో హెయిర్ లీవ్ చేసిన కేతిక.. గుర్రంపై కూర్చుని ఇచ్చిన ఒక్కో స్టిల్ అదిరిపోయింది. అలా ఆమె వీడియో వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. సూపర్ కేతిక అని పొగడ్తలు కురిపిస్తున్నారు. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతున్నారు.