పల్లెటూరి అందంలో కేతిక సొగసు!
పసుపు రంగు బ్లౌజ్, పచ్చని లంగా, గోధుమ రంగు పట్టు శాలువాతో ఆమె లుక్ సంప్రదాయ సొగసుకు కొత్త డెఫినిషన్ ఇస్తోంది.
By: Tupaki Desk | 9 Nov 2024 11:30 PM GMTకేతిక శర్మ.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ నిత్యం గ్లామర్ తో వైరల్ అవుతూ ఉంటుంది. కాఙ్ తన తాజా ఫోటోషూట్‌లో మాత్రం అమ్మడు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. గ్రామీణ వాతావరణంకు తగ్గట్టుగా సాంప్రదాయ టచ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోల్లో కేతిక తెలుగింటి అమ్మాయి రూపంలో సైకిల్ పక్కన నిలబడి కనిపిస్తుంది.
పసుపు రంగు బ్లౌజ్, పచ్చని లంగా, గోధుమ రంగు పట్టు శాలువాతో ఆమె లుక్ సంప్రదాయ సొగసుకు కొత్త డెఫినిషన్ ఇస్తోంది. "ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న మెరుపును వదిలివేస్తుంది" అంటూ క్యాప్షన్ జత చేసి ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. బహుశా ఒక కొత్త పాత్రకు సంబంధించి హింట్ ఇచ్చినట్లు అర్ధమవుతుంది. ఈ లుక్‌లో కేతిక తన లంగా ఓనికి వెన్నెల హంగులు జోడించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇలాంటి ట్రెడిషనల్ లుక్‌లో కూడా ఆమె గ్లామర్‌ను ఫోటోషూట్ ద్వారా పంచుకోవడం ఆమె ప్రత్యేకత. ఈ ఫోటోల్లో మామూలుగా కాకుండా కేతిక తనలోని ఇన్నర్ బ్యూటీని ప్రదర్శించింది. ఆమె అందంలో ఎక్కడా లోపం లేకుండా సింపుల్‌గా ఉండేలా ఫోటోలను ప్లాన్ చేసిన విధానం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేతిక శర్మ తన కెరీర్ విషయానికి వస్తే, ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తరువాత ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ, ఈ చిత్రాలు ఆమెకు పెద్దగా విజయాలు ఇవ్వలేదు. బ్రో సినిమాలో చేసినప్పటికీ ఆమెకు టాలీవుడ్ లో బ్రేక్ రావడం కాస్త ఆలస్యం అయింది. అయినప్పటికీ ఆమె తన ప్రత్యేకమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా కేతిక యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. రెగ్యులర్‌గా ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్‌లో కూడా ఫోటోషూట్ చేయడం ద్వారా తన అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతోంది.