Begin typing your search above and press return to search.

రాబిన్‌హుడ్ కేతిక.. గ్లామర్ తో కిక్కిచ్చేలా..

ఇక ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన తాజా పోస్టర్ లో కేతిక శర్మ అందం అభిమానుల హృదయాలను దొచేసింది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 6:54 AM GMT
రాబిన్‌హుడ్ కేతిక.. గ్లామర్ తో కిక్కిచ్చేలా..
X

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరోయిన్స్ లలో కేతిక శర్మ పేరు కూడా టాప్ లిస్టులో ఉంటుంది. ఈ బ్యూటీ చేసిన సినిమాల కంటే కూడా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి.

ఇక ఆమె అందానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ రోల్స్ పడితే మాత్రం మంచి పొజిషన్ లో ఉంటుంది అని నిత్యం ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక కేతిక స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తే చూడాలి అని మరికొందరు ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఇక వారి కోరికకు తగ్గట్లే ఇప్పుడు అమ్మడు ప్రత్యేకమైన సాంగ్ లో తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయబోతోంది.

నితిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన తాజా పోస్టర్ లో కేతిక శర్మ అందం అభిమానుల హృదయాలను దొచేసింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది.

స్పెషల్ సాంగ్ కు సంబంధించిన ఈ పోస్టర్ లో కేతిక శర్మ జాస్మిన్ బ్లౌజ్ ధరించి కనిపించింది. తన నాజూకు నడుమును ఎలివేట్ చేస్తూ ఇచ్చిన ఈ లుక్ అభిమానులకు మాయ చేయడం ఖాయం. జాస్మిన్ పూల మాలలతో తన లుక్ ను మరింత హైలైట్ చేస్తూ, కేతిక శర్మ గ్లామర్ పరంగా టాలీవుడ్ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ లుక్ లో ఆమె చూపులు, హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ పాట ప్రోమోను సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాటకి సంబంధించిన లిరికల్ వీడియో రేపు విడుదల కానుంది. జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతానికి కలిసొచ్చేలా కేతిక శర్మ తన డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసులను దోచుకోవడం ఖాయం. మొదటి పాట ఇప్పటికే సూపర్ హిట్ గా నిలవగా, రెండో పాట కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, కేతిక శర్మ ఈ ప్రత్యేక గీతంలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. కేతిక ఇప్పటి వరకూ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ లతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఈ సాంగ్ ఆమెకు మరింత పేరు తెచ్చిపెడుతుందని అంచనా వేయవచ్చు. ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి సాయిస్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.