కేతిక అప్పుడే ఐటెమ్ సాంగ్ చేయాల్సింది
ఒకరు చేయాల్సిన సినిమాను మరొకరు చేయడం, ఆ సినిమా హిట్ అయ్యాక అది నేను చేయాల్సిన సినిమా అని సదరు ఆర్టిస్టులు చెప్తుండటం చాలా కామన్.
By: Tupaki Desk | 24 March 2025 2:28 PM ISTసినీ ఇండస్ట్రీలో ఏ అవకాశం ఎవరి నుంచి ఎవరికి వెళ్తుందో చెప్పలేం. ఒకరు చేయాల్సిన సినిమాను మరొకరు చేయడం, ఆ సినిమా హిట్ అయ్యాక అది నేను చేయాల్సిన సినిమా అని సదరు ఆర్టిస్టులు చెప్తుండటం చాలా కామన్. ఏ సినిమా ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లే ఆ సినిమాను చేస్తారని, ఆ సినిమా వాళ్లదే అవుతుందనేది మాత్రం వాస్తవం.
అలానే కేతిక శర్మ చేయాల్సిన ఓ స్పెషల్ సాంగ్ ను సమంత చేసి నేషనల్ వైడ్ లో గుర్తింపు తెచ్చుకున్న వైనాన్ని మైత్రీ నిర్మాత రవి శంకర్ తాజాగా వెల్లడించాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 27న రిలీజ్ కానున్న సందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
రాబిన్‌హుడ్ సినిమాలో కేతిక శర్మ అదిదా సర్‌ప్రైజు అనే స్పెషల్ సాంగ్ చేసి నెట్టింట రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఆ ఆనందాన్ని తెలుపుతూ కేతిక పుష్ప సినిమాలోనే ఐటెమ్ సాంగ్ చేయాల్సిందనే విషయాన్ని తెలిపారు.
పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంత కంటే ముందే కేతికను అనుకున్నామని, కానీ అప్పుడది మిస్ అయిందని, మళ్లీ ఇన్నేళ్లకు కేతిక తో వర్క్ చేసే ఛాన్స్ దక్కిందని, ఈ సినిమాలో కేతిక సాంగ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రవి శంకర్ తెలిపారు. అన్నీ బావుండి కేతిక పుష్ప సినిమాలో ఊ కొడతారా సాంగ్ చేసి ఉంటే ఈ రోజు అమ్మడి స్థాయి వేరేలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు రాబిన్‌హుడ్ సినిమా వాస్తవానికి రష్మిక మందన్నా చేయాల్సింది. ఆమెను హీరోయిన్ గా అనుకునే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ రష్మిక పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల రాబిన్‌హుడ్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందని, అందుకే ఈ ప్రాజెక్టులోకి శ్రీలీల వచ్చిందని, రాబిన్‌హుడ్ శ్రీలీల కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు.