లెక్క తేల్చుకోవాలని డిసైడ్ అయ్యిందా..?
ఐతే హీరోయిన్స్ లో కొందరేమో కేవలం వారి యాక్టింగ్ టాలెంట్ తోనే అలరించాలని కొందరు ఆలోచిస్తే.. గ్లామర్ షో చేసైనా ఆడియన్స్ ని మెప్పించాలని మరికొందరు అనుకుంటారు.
By: Tupaki Desk | 8 March 2025 1:00 AM ISTహీరోయిన్ గా ఛాన్స్ రావడం కొద్దిగా కష్టపడితే వస్తుందేమో కానీ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ప్రతి వీకెండ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. వారిలో తమకంటూ ఒక ప్రత్యేకత ఉంటేనే ఆడియన్స్ ఇష్టపడతారు. అలాంటి వారికే స్టార్ క్రేజ్ ఇస్తారు. ఐతే హీరోయిన్స్ లో కొందరేమో కేవలం వారి యాక్టింగ్ టాలెంట్ తోనే అలరించాలని కొందరు ఆలోచిస్తే.. గ్లామర్ షో చేసైనా ఆడియన్స్ ని మెప్పించాలని మరికొందరు అనుకుంటారు.
ఐతే గ్లామర్ షో ప్రభావం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. అదే హీరోయిన్స్ తమ అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తే అందుకు తగినట్టుగా పాపులారిటీ సంపాదిస్తారు. ఈ ఫార్ములా తెలిసినా వచ్చిన ఛాన్స్ ని ఎందుకు వదులుకోవడం అనుకుని కొందరు భామలు సినిమాలు చేస్తుంటారు. అలాంటి వారిలో అందాల భామ కెతిక శర్మ ఒకరు. ఢిల్లీ నుంచి టాలీవుడ్ కి రొమాంటిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కెతిక శర్మ.
అమ్మడు ఆ సినిమాలోనే గ్లామర్ షోతో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఐతే ఆ సినిమా రిజల్ట్ నిరాశపరచడంతో రెండో ప్రయత్నంగా లక్ష్య చేసింది. అది కూడా పోవడంతో కాస్త డీలా పడింది. ఆ తర్వాత రంగరంగ వైభవంగా సినిమా చేసింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. రెండేళ్ల క్రితం బ్రో సినిమాలో అలా మెరిసిన కెతిక ఆ తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు.
ఐతే చివరగా నితిన్ లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్ లో అమ్మడు స్పెషల్ సాంగ్ ఛాన్స్ పట్టేసింది. నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అదిదా సర్ ప్రైజు అనే స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతుందట కెతిక శర్మ. కచ్చితంగా ఈ సాంగ్ తర్వాత కెతిక గురించి అందరు మాట్లాడుకుంటారని అంటున్నారు.
భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి ఆ సినిమా సూపర్ హిట్ సెంటిమెంట్ ని కొనసాగించాలని చూస్తుంది. సినిమాలో కరెక్ట్ టైం కి కెతిక స్పెషల్ సాంగ్ ప్లేస్ చేస్తున్నారట. ఈ సాంగ్ వల్ల ఆమెకు.. అమ్మడి వల్ల సినిమాకు కూడా హెల్ప్ అయ్యేలా సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి కెతిక నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షో చేసిందని అంటున్నారు. అదే నిజమై ఈ సాంగ్ క్లిక్ అయితే మాత్రం కెతికకు మళ్లీ వరుస ఛాన్స్ లు వచ్చేస్తాయని చెప్పొచ్చు.