Begin typing your search above and press return to search.

ఫోజ్ కొట్ట‌డంలో కేతిక త‌గ్గేదేలే

కేతిక ఇదిగో ఇలా రిసార్ట్ లాంజ్‌లో తీరిగ్గా కెమెరాల‌కు ఫోజులిచ్చింది. రిలాక్స్‌డ్‌గా భంగిమ‌లో కూచున్న కేతిక థై సొగ‌సుల‌ను ఎలివేట్ చేసింది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 6:30 PM GMT
ఫోజ్ కొట్ట‌డంలో కేతిక త‌గ్గేదేలే
X

ఆకాశ్ పూరి 'రొమాంటిక్' చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది బ్యూటీ కేతిక శ‌ర్మ త‌న‌దైన‌ అందం న‌ట‌న‌తో మైమ‌రిపించింది. నాగశౌర్య 'లక్ష్య' , వైష్ణవ్ తేజ్ స‌ర‌స‌న 'రంగ రంగ వైభవంగా' చిత్రాల‌లోను న‌టించింది. ఇటీవ‌ల నితిన్ నటించిన రాబిన్‌హుడ్ లో అధీ ధా సర్‌ప్రైజ్ అనే ప్రత్యేక పాటలో న‌ర్తించింది.

సినిమాలు, కెరీర్ సంగ‌తి అటుంచితే కేతిక‌కు సోష‌ల్ మీడియాల్లో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అంద‌చందాలు, న‌ట‌ప్ర‌తిభ‌కు ప్ర‌త్యేకించి ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో నిరంత‌ర ఫోటోషూట్ల‌తోను ఫ్యాన్స్ ని ఆక‌ర్షిస్తూనే ఉంది. కేతిక తాజాగా ఇన్ స్టాలో ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది.

కేతిక ఇదిగో ఇలా రిసార్ట్ లాంజ్‌లో తీరిగ్గా కెమెరాల‌కు ఫోజులిచ్చింది. రిలాక్స్‌డ్‌గా భంగిమ‌లో కూచున్న కేతిక థై సొగ‌సుల‌ను ఎలివేట్ చేసింది. ఈ ఫోటోషూట్ కి 'మంత్రము' అనే హ్యాష్ ట్యాగ్‌ని జోడించింది. కేతిక మంత్ర‌ముగ్ధం చేసే అంద‌చందాల‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా షేర్ అవుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కేతిక త‌దుప‌రి తెలుగు త‌మిళంలో క‌థ‌లు వింటోంది. ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన 'రాబిన్ హుడ్' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఎం రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి సంత‌కం చేసింది. కానీ అధికారికంగా వివ‌రాలు వెల్లడి కావాల్సి ఉంది.