Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : రెస్టారెంట్ లో అందాల కేతిక

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో 2021 లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతికా శర్మ.

By:  Tupaki Desk   |   20 Sep 2024 4:30 PM GMT
పిక్ టాక్‌ : రెస్టారెంట్ లో అందాల కేతిక
X

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో 2021 లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతికా శర్మ. ఆ సినిమా నిరాశ పరిచిన లక్ష్య సినిమాలో మరో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో ఈమె కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కేతిక 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశించింది. కానీ మరోసారి నిరాశే మిగిలింది. ఒక్క హిట్‌ లేక పోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

సినిమాల్లో ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ఈమధ్య కాలంలో చాలా కామన్‌ విషయం అయింది. అందుకే కేతిక శర్మ కూడా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా మరోసారి కేతిక శర్మ షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందాల కేతిక తాజాగా ఒక రెస్టారెంట్‌ లో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. కేతిక అందాల క్లీ వేజ్ షో తో హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇస్తూ ఫుడ్‌ ను ఆస్వాధిస్తున్న ఫోటోలు చూపరులకు భలే నచ్చుతున్నాయి. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఢిల్లీలో 1996 లో జన్మించిన కేతిక శర్మ చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌ లో అడుగు పెట్టింది. సోషల్‌ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్‌ గా పరిచయం అయ్యి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. కేతిక కి సోషల్‌ మీడియాలో దక్కిన గుర్తింపు కారణంగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఘనత ఈ అమ్మడికి దక్కింది అనడంలో సందేహం లేదు. నటిగా ముందు ముందు మరిన్ని సినిమాలు చేసేందుకు మరింత అందంగా రెడీ అవుతున్నట్టు చెప్పుకొచ్చింది.

కేతిక శర్మ మొదటి సినిమా రొమాంటిక్ లోనే రొమాన్స్ సన్నివేశాలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. భలే అందం అంటూ మొదటి సినిమా తో అనిపించుకున్న కేతిక శర్మ కి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత సినిమా అయినా ఆకట్టుకుని ఉంటే కచ్చితంగా ఫ్యూచర్‌ లో స్టార్‌ అయ్యి ఉండేది. కానీ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, రంగ రంగ వైభవంగా సినిమా సైతం నిరాశపరచడంతో కేతిక శర్మ కెరీర్ సందిగ్దంలో పడినట్లు అయింది.