Begin typing your search above and press return to search.

కేతిక పాప.. ఇంత గ్లామర్ తో షాక్ ఇస్తే ఎలా

ఇక సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కేతిక శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 10:16 AM GMT
కేతిక పాప.. ఇంత గ్లామర్ తో షాక్ ఇస్తే ఎలా
X

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది గ్లామరస్ బ్యూటీలు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్న కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కేతిక శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ బ్యూటీ మొదట సోషల్ మీడియాలో మంచి మోడల్ గా గుర్తింపుని అందుకుని.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది.


ఆమె నటించిన మొదటి సినిమా రొమాంటిక్. పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత ఆమె మరికొన్ని అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా పెద్దగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో అయితే గుర్తింపును అందుకోవడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో ఉనికిని చాటుకుంటూనే ఉంది.


రీసెంట్గా అమ్మడు ఊహించని విధంగా మరొక ఘాటైన ఫోటోతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. బికినీ కూడా కనిపించేలా తన జీన్స్ పాయింట్ లో వయ్యారంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. గతంలో కూడా ఇంతకంటే ఘాటైన స్టిల్స్ తో మెప్పించిన కేతిక శర్మ ఈసారి మరింత అందంగా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ఈ స్టిల్ చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో మరికొన్ని అవకాశాలు అందుకునేలా ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కేతిక శర్మ రొమాంటిక్ సినిమా తర్వాత లక్ష్యా, రంగా రంగా వైభవంగా.. అనే సినిమాలు చేసింది. అవి కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. చివరగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది. కానీ ఆ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో క్రేజ్ అయితే రాలేదు.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలోనే ఈ తరహాలో తన గ్లామర్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఒక మీడియం రేంజ్ హీరో సినిమాలో అవకాశం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.