పెద్దోడుకి స్పీడెక్కువ..చిన్నోడికి మొహమాటం ఎక్కువ!
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాన్ గారు
By: Tupaki Desk | 18 July 2023 7:38 AM GMT'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కేతిక శర్మ సుపరిచితమే. తొలి సినిమాతోనే అమ్మడు కుర్రాళకు దగ్గరైనా ఫలితం నిరాశపరిచింది. అటుపై 'లక్ష్య'..'రంగరంగ వైభవంగా' వంటి సినిమాలు చేసింది. ఇవి అమ్మడికి సక్సెస్ ని తేలేదు. అయితే 'రంగరంగ వైభవంగ'లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ లో కలిసి నటించింది. ప్రస్తుతం 'బ్రో' సినిమాలో సాయితేజ్ కి జంటగానూ నటించింది.
ఈ సినిమాతో రిలీజ్ రెడీ అయింది. ఈ సందర్భంగా అమ్మడి ముందుకు ఓ ఆసక్తిర ప్రశ్న వెళ్లింది. వైష్ణవ్..సాయితేజ్ అన్నదమ్ములిద్దరితో పనిచేసారు. ఆ ఇద్దరి లో వ్యత్యాసం ఏంటి? అనిడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'ఇద్దరు చాలా సరదాగా ఉంటారు. కానీ భిన్నమైన వ్యక్తిత్వాలు. వైష్ణవ్ కి మొహమాట ఎక్కువ. బాగా క్లోజ్ అయితే గానీ మూవ్ అవ్వలేడు. చనువు పెరిగాక చాలా సరదాగా ఉంటాడు.
మంచి మనిషి. ఇక సాయితేజ్ అందరితో కలివిడిగా ఉంటాడు. అందరితో జోకులేస్తూ కలిసిపోతుంటాడు. 'రంగ రంగవైభవంగా' చివరి దశలో ఉన్నప్పుడే 'బ్రో' సినిమాలో అవకాశం వచ్చింది.
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాన్ గారు. ఆయన పేరు వినగానే ఇంకేమి ఆలోచించకుండా సైన్ చేసా. ఆయన ..నేను తెరపై కనిపిస్తాం. గానీ పవన్ తో సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో తెరను పంచుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.
ఈ సినిమాతోనే తొలిసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. సాయితేజ్ ఆయన దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసాడు. ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలు మంచి అనుభూతినచ్చింది. బ్రో అంటే ఓ భావేద్వేగం.
నా స్నేహితులందరినీ బ్రో అనే పిలుస్తుంటా. నిజ జీవితంలోనూ నాకు ఒక సోదరుడు ఉన్నాడు. తను ఆస్ట్రేలియాలో ఉంటాడు . బ్రో సినిమా తర్వాత తదుపరి సినిమా విశేషాలు తెలియజేస్తా. ఆహాస్టూడియోస్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. అంతకుమించి దాని గురించి ఎక్కువ చెప్పలేను' అన్నారు.