Begin typing your search above and press return to search.

కేతిక.. ఇప్పటికైనా లక్కు మారేనా?

రొమాంటిక్ మూవీ తర్వాత లక్ష్య చిత్రంలో నాగ శౌర్యకి జోడీగా నటించింది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 3:30 AM GMT
కేతిక.. ఇప్పటికైనా లక్కు మారేనా?
X

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నార్త్ ఇండియన్ భామ కేతిక శర్మ. ఈ సినిమాలో ఆకాష్ పూరికి జోడీగా నటించిన కేతిక శర్మ గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. దీంతో వెంటవెంటనే ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చి పడ్డాయి. రొమాంటిక్ మూవీ తర్వాత లక్ష్య చిత్రంలో నాగ శౌర్యకి జోడీగా నటించింది.

నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా మూవీలో ఆడిపాడింది. బ్రో చిత్రంలో సాయి తేజ్ కి జోడీగా చేసింది. అయితే ఈ నాలుగు సినిమాలు కెరియర్ పరంగా ఆమెకి ఏ విధంగా ప్లస్ కాలేదు. ఈ చిత్రాలు కమర్షియల్ గా ఫెయిల్ కావడంతో కేతిక శర్మపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీంతో టాలీవుడ్ నుంచి ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.

అయితే చేతిలో అవకాశాలు లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు, షార్ట్ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. మోడల్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గానే కేతిక శర్మకి ఎక్కువ పాపులారిటీ ఉంది.

అదే ఇమేజ్ తో సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలోనే ద్వారా రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కేతిక శర్మ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలలో అమ్మడు వివిధ రకాల గ్లామరస్ లుక్స్ లో అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. వయ్యారాలు పోతు కెమెరాలకి ఫోజులిస్తుంది.

ఇక ఆమె ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్ళపైకి చూపుల బాణాలు విసురుతుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గ్లామర్ తో అమ్మడు మంచి అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. అయితే ఈ కాలంలో ఈ రూట్లో పోటీగా చాలామంది ఉన్నారు. కేవలం ఇలా ఘాటైన ఫొటోలతో ఛాన్సులు అందుకోవడం మామూలు విషయం కాదు. మరి ఈ బ్యూటీకి ఈ ఘాటైన పోటోలతో ఏమైనా లక్కు మారుతుందో లేదో చూడాలి.