Begin typing your search above and press return to search.

రొమాంటిక్ బ్యూటీకి రొమాంటిక్ ప్రశ్న

గత ఏడాది పవన్ కళ్యాణ్ మూవీ 'బ్రో' లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 March 2024 6:45 AM GMT
రొమాంటిక్ బ్యూటీకి రొమాంటిక్ ప్రశ్న
X

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఫ్లాప్ ని చవిచూసినా కూడా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది. లక్ష్య మరియు రంగ రంగ వైభవంగా సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.

గత ఏడాది పవన్ కళ్యాణ్ మూవీ 'బ్రో' లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది లో ఇప్పటి వరకు ఈమె కొత్త సినిమా కమిట్‌ అవ్వలేదు. త్వరలో ఈమె ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న ను అందాల కేతిక షేర్ చేసింది.

రెగ్యులర్‌ గా నెటిజన్స్ తో చిట్‌ చాట్‌ చేస్తూ, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉండే కేతిక ని ఒక నెటిజన్... నువ్వు అల్‌జీబ్రా లో గుడ్‌యేనా.. ఒకవేళ నిజం అయితే.. ఏం మాట్లాడకుండా, ఎందుకు అనకుండా నా ఎక్స్‌(మాజీ ప్రియురాలు) ప్లేస్ లోకి వచ్చేస్తావా అంటూ ప్రశ్నించాడు.

ఆ నెటిజన్ ప్రశ్నకు కేతిక షాక్ అయ్యింది. తన షాక్‌ ఎక్స్ ప్రెషన్ ను కేతిక ఆ ప్రశ్నకు సమాధానంగా షేర్ చేసింది. ప్రస్తుతం నెటిజన్ ప్రశ్న మరియు కేతిక సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో హీరోయిన్స్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురు అవ్వడం చాలా కామన్‌. అయితే వారు ఆ సమయంలో సమయస్ఫూర్తితో స్పందిస్తే విమర్శకుల ప్రశంసలు పొందవచ్చు. ఇప్పుడు కేతికను చాలా మంది కోపం తెచ్చుకోకుండా సింపుల్‌ గా సమాధానం ఇవ్వడం అభినందనీయం అంటున్నారు.