చురకత్తిలాంటి చూపుల్తో గుచ్చేస్తూ..!
లేటెస్ట్ గా కెతిక మరో క్రేజీ ఫోటో షూట్ ని చేసింది. టైట్ ఫిట్ డ్రెస్ లో తన పరువాల తో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేస్తుంది అమ్మడు.
By: Tupaki Desk | 7 Feb 2024 11:50 AMడబ్ స్మాష్ తో పాపులారిటీ తెచ్చుకుని ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కెతిక శర్మ. మొదటి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా కెతికకు మంచి క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అనేస్తున్న అమ్మడికి వెంటనే నాగ శౌర్య లక్ష్య సినిమాలో ఛాన్స్ వచ్చింది. అన్ లక్కీగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల కాస్త రిస్క్ లో పడింది. అయితే థర్డ్ అటెంప్ట్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసింది కెతిక.
అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక చివరగా లాస్ట్ ఇయర్ బ్రో సినిమాలో నటించిన కెతిక ఆ సినిమాలో తేజ్ లవర్ గా నటించి మెప్పించింది.
నటన పరంగా ఏమో కానీ కెతిక సినిమాలో ఉంటే గ్లామర్ పరంగా డౌట్ అక్కర్లేదని ప్రూవ్ చేసుకుంది. పూజా హెగ్దేకి ఏమాత్రం తగ్గకుండా థై షో చేస్తున్న ఈ భామ కాస్త ఐడెంటిటీ వచ్చే పాత్రలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.
ఇక చేతిలో సినిమాలు లేకపోతే ప్రతి హీరోయిన్ చేసే రెగ్యులర్ యాక్టివిటీగా కెతిక శర్మ కూడా రకరాకల ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. కెతిక ఫోటో షూట్ వచ్చింది అంటే చాలు ఆమె ఫాలోవర్స్ వాటిని తెగ వైరల్ చేస్తుంటారు. లేటెస్ట్ గా కెతిక మరో క్రేజీ ఫోటో షూట్ ని చేసింది. టైట్ ఫిట్ డ్రెస్ లో తన పరువాల తో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేస్తుంది అమ్మడు.
అంతేకాదు చురకత్తిలాంటి ఆమె చూపుల్తో ఆడియన్స్ గుండెల్ని గాయం చేస్తుంది. కెతిక శర్మ ది పర్ఫెక్ట్ బోల్డ్ బ్యూటీ లాంటి సూపర్ కామెంట్స్ తో ఆమెను పొగిడేస్తుంటారు ఫాలోవర్స్. అయితే ఫోటో షూట్స్ తో ఎంత ప్రభావం చూపించినా సినిమాల అవకాశాలు వస్తేనే కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది. మరి కెతిక నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఏంటన్నది తెలియదు కానీ ఈ ఫోటో షూట్స్ తో మరోసారి అమ్మడు సోషల్ మీడియాలో డిస్కషన్స్ కి రీజన్ అయ్యింది. ఇలానే ఫోటో షూట్స్ తో మెప్పిస్తూ ఉంటే ఏదో ఒక డైరెక్టర్ దృష్టిలో పడితే బాగుంటుందని కెతిక ఫాలోవర్స్ అనుకుంటున్నారు.