Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జిల్ల‌నిపిస్తున్న‌ కేతిక అందాలు

అదేక్ర‌మంలో ఇటీవలి ఫోటోషూట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వందల వేల లైక్‌లతో దూసుకెళుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:00 PM GMT
ఫోటో స్టోరి: జిల్ల‌నిపిస్తున్న‌ కేతిక అందాలు
X

స్ట్రైకింగ్ ఫోజ్‌ల‌తో కుర్ర‌కారు గుండెల్ని జిల్ల‌నిపించ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది కేతిక శ‌ర్మ‌. ఈ దిల్లీ బ్యూటీ అందంలో న‌ట‌న‌లో ఇప్ప‌టికే నిరూపించుకుని తెలుగు యువ‌హీరోల స‌ర‌స‌న స‌రిజోడుగా ఎదిగింది. సౌత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో వర్ధమాన తారగా కేతికా శర్మ ఒక వెలుగు వెలుగుతోంది. తన అద్భుతమైన గ్లామరస్ లుక్స్ స్టైల్‌ను ఎలివేట్ చేస్తూ వ‌రుస‌ ఫోటోషూట్‌లతో ఆకర్షిస్తోంది. 2023లో పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న‌ కేతిక అద్భుతంగా న‌టించింది.

మెగా హీరోల స‌ర‌స‌న‌ స్క్రీన్‌ను షేర్ చేసుకున్న కేతికకు ఇప్పుడు అద్భుత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అదేక్ర‌మంలో ఇటీవలి ఫోటోషూట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వందల వేల లైక్‌లతో దూసుకెళుతున్నాయి.

దర్శక‌నిర్మాత‌ పూరి జగన్నాథ్ కేతికను 2019 విడుదలైన రొమాంటిక్ చిత్రంతో పరిశ్రమకు పరిచయం చేసాడు. అరంగేట్రం నెమ్మ‌దిగా ఉన్నా కానీ, కేతిక ప్రతిభ సంకల్పం లక్ష్యం ప‌రిశ్ర‌మ గ‌మ‌నించింది. సాయిధ‌ర‌మ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న‌ రంగం రంగ వైభవంగా లో అవ‌కాశం అందుకుంది.

ఇక లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డే ఈ బ్యూటీ త‌న‌ ఫోటోషూట్‌లకు సంబంధించి విమర్శలు ఎదుర్కొన్నా కానీ.. కేతిక గర్వంగా తన వంపులను ఆవిష్క‌రిస్తోంది. తనదైన అందం ఆకర్షణతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కేతిక తాజా ఫోటోషూట్ ఇప్పుడు మ‌రోసారి ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోటోషూట్ లో అంద‌మైన ఫ్రాక్ లో మిల్కీ వైట్ అందాల‌ను ఆవిష్క‌రిస్తూ కేతిక మ‌తులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.