అమెరికా అధ్యక్షుడి రేసులో MeeToo మాన్‌స్టర్
రాజకీయాల్లో రాణించాలంటే 'మంచితనం' ఒక అనర్హత. కిరాతక రాజకీయాల్లో మంచికి తావు లేదు
By: Tupaki Desk | 28 Dec 2023 4:44 AM GMTరాజకీయాల్లో రాణించాలంటే 'మంచితనం' ఒక అనర్హత. కిరాతక రాజకీయాల్లో మంచికి తావు లేదు. అందుకే రాజకీయాల్లో క్రిమినల్స్, దివాళా తీసి సంఘంలో అరాచకాలకు పాల్పడే బాపతుకే స్కోప్ ఎక్కువ. భారతీయ క్రికెట్ కి బ్యాడ్ నేమ్ తెచ్చిన బౌలర్ శ్రీశాంత్ ఆ తర్వాత రాజకీయాల్లోకే వచ్చాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు లైంగిక వేధింపుల రాక్షసుడు, నటుడు కెవిన్ స్పేసీ బరిలో దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది.
కెవిన్ స్పేసీపై ఊపిరాడనన్ని కేసులు.. మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదురైనా ఇప్పుడు అతడు అధ్యక్షుడు అవుతాడట. పాపులర్ టక్కర్ కార్ల్సన్ క్రిస్మస్ షోలో కెవిన్ స్పేసీ పాల్గొన్నాడు. తాజా చాటింగ్ సెషన్ లో అతడు 2024 లో అమెరికా అధ్యక్ష రేసులో చేరడం గురించి హింట్ ఇచ్చాడు.
కెవిన్ స్పేసీ ఆస్కార్ అవార్డు విజేత. అమెరికాలో ప్రముఖ నటుడు. MeToo ఉద్యమం సమయంలో లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొన్న కెవిన్ స్పేసీ, సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల టక్కర్ కార్ల్‌సన్‌తో ఒక ఇంటర్వ్యూలో కనిపించారు. ఆదివారం విడుదలైన ఈ ఇంటర్వ్యూలో స్పేసీ ప్రెసిడెంట్ రేసులోకి వెళుతున్నాడని ట్విస్ట్ ఇచ్చారు. చీకటి కాలంలో దేశానికి తనలాంటి వ్యక్తి అవసరమని స్పేసీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల లండన్ కోర్టు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై నిర్దోషిగా ప్రకటించాక పరిణామమిది. ఈ ఇంటర్వ్యూలో కెవిన్ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని చమత్కరించడంతో ఆ వ్యాఖ్య వైరల్ గా మారుతోంది. ఈ ఇంటర్వ్యూలో స్పేసీ తాను నటించిన సినిమాలో ప్రతినాయకుడైన ఫ్రాంక్ అండర్‌వుడ్ పాత్రను ఒక క్షణం పాటు చూపించాడు. ''నేను ఈ షోకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాత్రను స్వీకరించడం అంటే అది ఈ గొప్ప దేశం కోసం నేను చేయాలనుకున్న త్యాగం'' అని స్పేసీ అన్నాడు.
నటుడు కెవిన్ స్పేసీ లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్న తర్వాత TV సిరీస్ హౌస్ ఆఫ్ కార్డ్స్ దాని చివరి సీజన్‌లో ఫ్రాంక్ అండర్‌వుడ్ పాత్రను తొలగించింది. అయితే లండన్ కోర్టు ఇటీవల తొమ్మిది లైంగిక నేరాల ఆరోపణల నుండి స్పేసీని నిర్దోషిగా ప్రకటించింది. అప్పటి నుండి కెవిన్ తిరిగి నటుడిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. మీడియా ఇంటర్వ్యూలతో అదరగొడుతున్నాడు.
నెట్‌ఫ్లిక్స్ వెన్నుపోటుపై కెవిన్:
హౌస్ ఆఫ్ కార్డ్స్ చివరి సీజన్‌లో MeToo ఉద్యమంలో భాగంగా లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత నెట్ ఫ్లిక్స్ కెవిన్ స్పేసీని తొలగించింది. కార్ల్‌సన్‌తో ఒక ఇంటర్వ్యూలో ఈ ఆరోపణల గురించి ప్రశ్నించినప్పుడు స్పేసీ వాటిని తిరస్కరించాడు. తాను నిర్ధోషిని అని అన్నాడు. స్పేసీ వ్యాఖ్యల ప్రకారం తన పతనానికి కారణం 'మీడియా ఉన్మాదం' అని, నెట్‌ఫ్లిక్స్ కపటత్వం ప్రధాన కారణమని ఆరోపించాడు. హౌస్ ఆఫ్ కార్డ్స్ ని చూడాలని, ప్రజలు నా కోసం ట్యూన్ చేస్తారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ని చూసి కాదు.. అని కూడా కెవిన్ ఘాటుగా విమర్శించాడు. తన పాత్ర ఫ్రాంక్ అండర్‌వుడ్‌కు ఉన్న క్రేజ్ గొప్పది ..ప్రజలు నెట్‌ఫ్లిక్స్ చూసేలా చేసిన పాత్ర అని కూడా అన్నాడు.
నిజానికి ఫ్రాంక్ అండర్‌వుడ్ పాత్ర కారణంగా హౌస్ ఆఫ్ కార్డ్స్ నెట్‌ఫ్లిక్స్ భారీ సంఖ్యలో చందాదారులను ఆకర్షించింది. ఐదు సీజన్లలో అండర్‌వుడ్ పాత్ర ఒక కల్ట్ ఫాలోయింగ్‌ను అందుకుంది. అయితే ఆరోపణల కారణంగా చివరి సీజన్ నుండి కెవిన్ ని తొలగించారు. 2012 నాల్గవ త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ మొత్తం దాదాపు 31 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నామని ప్రకటించింది. ఇది జనాదరణ పొందిన హౌస్ ఆఫ్ కార్డ్స్ షో ప్రారంభానికి ముందు. మూడేళ్లలో చందాదారుల సంఖ్య రెండింతలు పెరిగింది. 2015 నుండి ఇది మళ్లీ రెండింతలు పెరిగింది.