Begin typing your search above and press return to search.

అటు మెగా.. ఇటు అల్లు.. కీలక బాధ్యతల్లో బన్నీ వాస్!

అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Feb 2025 8:18 AM GMT
అటు మెగా.. ఇటు అల్లు.. కీలక బాధ్యతల్లో బన్నీ వాస్!
X

అటు మెగా కుటుంబం... ఇటు అల్లు ఫ్యామిలీ.. రెండు క్యాంపుల్లో కనిపించే వ్యక్తుల్లో నిర్మాత బన్నీ వాసు ఒకరన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితోపాటు ఫ్యామిలీ అభిమానిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. అప్పట్లో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప‌బ్లిసిటీ కోర్డినేష‌న్ బాధ్యతలను నిర్వర్తించారు బన్నీ వాసు.

ఆ తర్వాత జనసేన పార్టీ ప్రారంభం నుంచి కూడా కీలక పాత్ర పోషించారు. మెగా ఫ్యామిలీతో మంచి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు.

కొంతకాలం క్రితం ఆయ్ తో వచ్చిన ఆయన.. రీసెంట్ గా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు జీఏ 2 బ్యానర్ పై మరిన్ని సినిమాలు తీయనున్నారు. ఆడియన్స్ ను అలరించనున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

అల్లు ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనలో కీలక పదవిలో నియమితులయ్యారు. మార్చి 14న జ‌రిగే ఆవిర్బావ స‌భ కార్య‌క్ర‌మానికి ఆయననకు ప‌బ్లిసిటీ అండ్ డెక‌రెష‌న్ ఇన్‌ఛార్జ్ గా జనసేనాని నియమించారు. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మెుద‌టి జ‌న‌సేన ఆవిర్భావ స‌భ కావ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌ నాయకుల చూపు దానిపై ఉందని రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో అలాంటి కీలకమైన సభకు సంబంధించిన బాధ్య‌త‌ను బ‌న్నీ వాసుకు అప్ప‌గించడం విశేష‌మనే చెప్పాలి. అయితే రీసెంట్ గా లైలా మూవీ ఫంక్షన్ లో చిరంజీవి.. అల్లు అర్జున్ తోపాటు పుష్ప గురించి మాట్లాడారు. ఇప్పుడు బన్నీ వాసుకు జనసేన సభకు బాధ్యతలు అప్పగించడంతో గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతున్న గాసిప్స్ కు చెక్ పెట్టినట్లైంది. మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని, రెండు ఫ్యామిలీల మధ్య బన్నీ వాస్ నలుగుతున్నట్లు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.