Begin typing your search above and press return to search.

ఖైదీ 2.. ఓ ప్లాను ఓ పద్దతి!

తాజాగా కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఖైది మూవీ సీక్వెల్ 2025లో స్టార్ట్ చేస్తారంట. ఈ సినిమాకి సంబంధించి మెయిన్ స్టోరీ లైన్ అయితే ఉందంట.

By:  Tupaki Desk   |   11 July 2024 4:54 AM GMT
ఖైదీ 2.. ఓ ప్లాను ఓ పద్దతి!
X

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన ఖైదీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కార్తీ ఇమేజ్ ని సైతం ఈ మూవీ మార్చేసింది. లోకేష్ కనగరాజ్ కి ఖైదీ మూవీ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత లోకేష్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఖైదీ మూవీతో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ చేశాడు. దీంట్లో అన్ని మాఫియా బ్యాక్ డ్రాప్ కథలు చేస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మాఫియా కథాంశంతోనే ఉండబోతోంది. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉండబోతోందంట. ఖైదీ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలో లోకేష్ ప్రకటించాడు. అతను వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉండటంతో ఖైది మూవీ సెట్స్ పైకి వెళ్ళడం లేదు. కచ్చితంగా ఈ సీక్వెల్ ఉంటుందని మాత్రం లోకేష్ చెబుతున్నారు.

తాజాగా కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఖైది మూవీ సీక్వెల్ 2025లో స్టార్ట్ చేస్తారంట. ఈ సినిమాకి సంబంధించి మెయిన్ స్టోరీ లైన్ అయితే ఉందంట. కూలీ కంప్లీట్ చేసిన తర్వాత ఖైదీ పార్ట్ 2 పైన లోకేష్ దృష్టి పెట్టబోతున్నాడంట. కార్తీ అభిమానులు కూడా ఈ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ సర్దార్ మూవీ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు.

ఇది కంప్లీట్ అయ్యాక ఖైదీ పార్ట్ 2ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దీని తర్వాత లోకేష్ విక్రమ్ సీక్వెల్, అలాగే లియో సీక్వెల్స్ కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ ని కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకురావాలని లోకేష్ అనుకుంటున్నారు. అయితే మరో రెండు, మూడేళ్ళ వరకు ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఖైదీ పార్ట్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారంట.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోయే కూలీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అన్ని భాషలకి సంబందించిన స్టార్ యాక్టర్స్ ని తీసుకోవాలని లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు.