Begin typing your search above and press return to search.

'ఖలేజా' దిలావర్ వైఫ్.. సడన్ ట్రేండింగ్!

సోషల్ మీడియా అనే సాధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 4:45 AM GMT
ఖలేజా దిలావర్ వైఫ్.. సడన్ ట్రేండింగ్!
X

సోషల్ మీడియా అనే సాధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో మెరిసి.. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయిన చాలా మంది నటీమణులు కూడా వెలుగులోకి వచ్చి యమా హైలైట్ అయిపోయారు. అలా ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎంతో మంది సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి దివ్య మేరీ సిరియాక్ ఒకరు.


దివ్య మేరీ సిరియాక్ అంటే ఎవరు అనేది మీరు గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ‘ఖలేజా’ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన అమ్మాయి అని తెలిస్తే ఇట్టే పట్టేస్తారు. దీనికి కారణం ఈ అమ్మడు కనిపించింది కాసేపే అయినా ఈ చిత్రంలో బాగా హైలైట్ అయింది. మహేష్ చెక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె రొట్టెలు చేస్తూ రెండు ఫ్రేమ్ లలో కనిపిస్తుంది. కేవలం ఆమె ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అయినా కూడా ఆమె హోమ్లీ లుక్ కి ఇప్పుడు సోషల్ మీడియా జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు


అయితే, ఆ తర్వాత మాత్రం దివ్య మేరీ సిరియాక్ మరో మూవీలో సందడి చేయలేదు. దీంతో చాలా మంది ఈమె అంటూ ఒకరు ఉన్నారు అన్నదే మర్చిపోయారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం దివ్య మేరీ సిరియాక్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది వెతకడం మొదలు పెట్టారు. ‘ఖలేజా’ సినిమాలో ఆమె కనిపించిన గెటప్‌ ఫొటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో జల్లెడ పట్టారు.


ఫలితంగా ఆమె పేరును ట్రెండింగ్‌లో పెట్టేశారు. అలా వెతికి ఇలా వెతికి చివరికి దివ్య మేరీ సిరియాక్‌ను కొందరు ఔత్సాహిక నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో ఇటీవలే గుర్తించారు. ‘ఖలేజా’ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన దివ్య మేరీ సిరియాక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను చూసిన వాళ్లంతా యమా షాక్ అవుతున్నారు. దీనికి కారణం ఈ అమ్మడు అప్పుడు కనిపించిన దానికి ఇప్పుడు ఉన్న దానికి అస్సలు పోలికలే లేనట్లుగా ఉండడమే.


అంతలా దివ్య మేరీ సిరియాక్ ఏజ్ పెరిగినా తనదైన అందంతో కట్టిపడేస్తోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత కనిపించిన ఈ భామ ఇప్పుడు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఇక, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన చిత్రమే ‘ఖలేజా’. ఇందులో హీరో పాత్ర దిలావర్ సింగ్ అే వ్యక్తిని వెతుక్కుంటూ రాజస్థాన్ చేరుకుంటుంది. ఆ సమయంలో అతడి భార్యగా దివ్య మేరీ సిరియాక్ కనిపిస్తుంది. ఆమె మహా అంటే రెండు మూడు ఫ్రేమ్స్‌లో మాత్రమే ఉంటుంది. కానీ, ప్రేక్షకుల చూపులు లాగేసుకుంది. అలాంటి ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.