కంప్లీట్ స్టార్ లా మనోళ్లకి సాధ్యం కాదా?
కాబట్టి తెలుగు హీరోలెవరూ అక్షయ్...మోహన్ లాల్ తో పోటీ పడటం అనేది జరిగే పని కాదనే చెప్పాలి.
By: Tupaki Desk | 4 Oct 2023 3:30 PM GMTమాలీవుడ్ లో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్...బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఎంత బిజీగా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. మోహన్ లాల్ ఏడాదికి కనీసం ఐదారు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. డే అండ్ నైట్ షూటింగ్ లు చేస్తారు. ఆయన సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయడం అన్నది కేవలం మోహన్ లాల్ కే చెల్లింది. ఆ విషయంలో తనని చూసి నేర్చుకోవాలని మమ్ముట్టి సైతం నర్మగర్భంగా చెబుతుంటారు.
నేటి తరం యువత ఆయన స్పూర్తితో ఎక్కువ సినిమాలు చేయాలని సూచిస్తుంటారు. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కూడా అంతే బిజీగా ఉంటారు. ఏడాదికి కనీసం నాలుగు లేదా ఐదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తారు. చిన్న..పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ఏ అవకాశం వదిలి పెట్టరు. సినిమా ఎంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసాం? అన్న కోణంలో కిలాడీ వేగం కనిపిస్తుంది. రాబోయే రెండేళ్లకి సంబంధించి అక్షయ్ షెడ్యూల్ ఎంత టఫ్ గా ఉందో ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు సంఖ్య చూస్తే అర్దమవుతుంది.
పదికి పైగా సినిమాలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు కొన్ని వారాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'మిషన్ రాణిగంజ్' ఈ శుక్రవారం విడుదలవుతెంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. అలాగే 'వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్' సెట్స్ లో ఉంది. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 'బడే మియాన్ చోటే మియాన్'.. 'స్కై ఫోర్స్'..' సూరరై పొట్రు రీమేక్' .'హేరా ఫేరి 3'.. 'శంకర' లాంటి సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా 'హౌస్‌ఫుల్ 5'.. 'వెల్‌కమ్ 3' ..'సింఘమ్ ఎగైన్' వంటి ఫ్రాంచైజీ చిత్రాలు కిలాడీ హ్యాండ్స్ లోనే ఉన్నాయి.
ఇంకా షారుక్ ఖాన్...సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ లాంటి హీరోలు లాంగ్ గ్యాప్ తీసుకున్నా! ఒకేసారి వాళ్లు చేసిన సినిమాలు ఒకదాని వెంట ఒకటి రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్ చేసుకుంటారు. షారుక్ నటించిన 'పఠాన్'..'జవాన్' ఈ ఏడాది అలాగే రిలీజ్ అయ్యాయి. 'డుంకీ'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే టాలీవుడ్..కోలీవుడ్ హీరోలకు మాత్రం ఇలా అక్షయ్ కుమార్..మోహన్ లాల్ లా సినిమాలు చేయడం మాత్రం సాధ్యపడటం లేదు.
ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేయాలని చెబుతారుగానీ..ఒక సినిమా కూడా రిలీజ్ చేయడం కష్టంగానే ఉంది. పైగా ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా మత్తులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి తెలుగు హీరోలెవరూ అక్షయ్...మోహన్ లాల్ తో పోటీ పడటం అనేది జరిగే పని కాదనే చెప్పాలి.