నయనతారతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వైఫ్!
తాజాగా ఈ ప్రచారం పై సుందర్ సి. భార్య, నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 26 March 2025 6:43 AMలేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో సుందర్. సి దర్శకత్వంలో 'మూకుతీ అమ్మన్-2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కు నయనతారకు మధ్య గొడవ అయిందనే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. డ్రెస్సుల విషయంలో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తినట్లు వినిపిస్తుంది. దీంతో షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే చిత్ర దర్శకుడు సుందర్ తో కూడా నయన్ తగాదాకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో షూటింగ్ మధ్యలోనే నయన్ సెట్స్ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిందని, కానీ నిర్మాత ఐసరి గణేష్ వెంటనే కల్పించుకుని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో వెనక్కి తగ్గిందని వార్త లొస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారం పై సుందర్ సి. భార్య, నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి గొడవలు జరగలేదని..ఆధారంలేని ఆరోపణలు చేయోద్దని విజ్ఞప్తి చేసారు.
సినిమా షూటింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుందని ఎవరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని..తప్పుడు ప్రచారంతో ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించొద్దన్నారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని తేలిపోయింది. ఈ మధ్య కాలంలో నయన్ పేరు మళ్లీ వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే నెటిజనులు నయన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో మండిపడ్డారు.
ఆమె యాటిట్యూడ్ తోనే ఈ రకమైన సమస్యలొస్తున్నాయని...ఓ పూజలో నటి మీనాని అవమానించినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రతిగా మీనా అభిమానులు నయన్ తీరుపై మండిపడ్డారు. ఆ వివాదం పూర్తిగా చల్లారకముందే? కొత్త వివాదంతో అంటగాగడం ఆసక్తికరంగా మారింది.