Begin typing your search above and press return to search.

న‌న్ను వేధించిన నాన్న చ‌నిపోయాడని తెలిసింది: ఖుష్బూ

తాజా ఇంటర్వ్యూలో త‌న తండ్రి గ‌త ఏడాది చ‌నిపోయార‌ని తెలిసిన వారి ద్వారా తెలిసింద‌ని కూడా ఖుష్బూ ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 10:53 AM GMT
న‌న్ను వేధించిన నాన్న చ‌నిపోయాడని తెలిసింది: ఖుష్బూ
X

ప్ర‌ముఖ నటి , రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల తన చిన్నతనంలో త‌న‌కు తండ్రి వ‌ల్ల ఎదురైన వేధింపుల గురించి తాజా ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి మాట్లాడారు. 14 వ‌య‌సులో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపుల‌కు గ‌ర‌య్యాన‌ని, శారీర‌కంగా హింసించాడ‌ని ఖుష్బూ పేర్కొన్నారు. త‌న త‌ల్లిని తీవ్రంగా శారీరక వేధింపులకు గురి చేసేవాడు. త‌న సోద‌రి సోద‌రుడిని కొట్టేవాడు. ఒక‌సారి అమ్మ త‌ల‌ను గోడకు బాదాడు. ఎదిగే క్ర‌మంలో తాను ఎదుర్కొన్న బాధాకరమైన విష‌యాల‌ను ఖుష్బూ వెల్ల‌డించారు.

తాజా ఇంటర్వ్యూలో త‌న తండ్రి గ‌త ఏడాది చ‌నిపోయార‌ని తెలిసిన వారి ద్వారా తెలిసింద‌ని కూడా ఖుష్బూ ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అత‌డు బెల్టు, కట్టు, షూ హీల్స్‌తో కొట్టేవాడు. నా తల్లిని గోడకు కొట్టేవాడు. దారుణంగా దుర్భాషలాడేవాడు.. ఇవ‌న్నీ భ‌రించాము. కానీ 14 ఏళ్ల వ‌య‌సులో మొద‌టిసారి అత‌డి వేధింపుల గురించి బ‌హిరంగంగా మాట్లాడాను. సినీరంగంలోకి వచ్చిన త‌ర్వాతే త‌న‌కు ధైర్యం వ‌చ్చింద‌ని ఖుష్బూ వెల్ల‌డించారు.

తాను నిజాలు బయటపెడితే తన తండ్రి తన కుటుంబ సభ్యులపై మరింత హింసాత్మకంగా వ్యవహరిస్తాడని భయపడిన‌ట్టు తెలిపారు. ఇంట్లోవారిని మరింత కొడతాడనే భయం నాలో ఉంది. అతడు నా సోదరులను, నా తల్లిని ఎలా కొడుతున్నాడో నేను ఇప్పటికే చూస్తున్నందున భారాన్ని భరించాననిపిస్తుంద‌ని ఖుష్బూ సుంద‌ర్ అన్నారు.

జాను సినిమా సెట్స్‌లో తనతో కలిసి పనిచేసిన హెయిర్‌డ్రెస్సర్ ఉబిన్‌కి ఖుష్బూ ధైర్యం చెబుతూ సహాయం చేసింది. ఖుష్బూ విష‌యంలో ఆమె తండ్రి ప్రవర్తించే విధానాన్ని గమనించి ఏదో తప్పు జరిగిందని అనుమానించారు. చివరికి ఖుష్బూ తండ్రి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. సెప్టెంబరు 1986లో మమ్మల్ని విడిచిపెట్టాడ‌ని ఖుష్బూ తెలిపారు. గత సంవత్సరం మరణించాడని ఇత‌రుల ద్వారా తెలిసింద‌ని వెల్ల‌డించారు. అత‌డు వెళ్లిపోయినప్ప‌టి నుంచి ఎక్కడ కూడా నాకు తెలియదు. అప్పటి నుండి నేను అతనిని చూడలేదు అని ఖుష్బూ అన్నారు.