ఆ హీరో నాకేమైనా ఛాన్సుందా? అనడిగాడు.. చెప్పుతో సమాధానమిచ్చాను: ఖుష్బూ
#మీటూ ఉద్యమం స్ఫూర్తితో చాలా మంది నటీమణులు, కథానాయికలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెనయ్యారు.
By: Tupaki Desk | 22 Nov 2024 12:00 PM GMT#మీటూ ఉద్యమం స్ఫూర్తితో చాలా మంది నటీమణులు, కథానాయికలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెనయ్యారు. సినీపరిశ్రమలో వేధింపుల వ్యవహారం గుట్టు బయటపడింది. ఇందులో భయానక నిజాలు తెలిసాయి. ఇప్పటికీ పలువురు కథానాయికలు వేధింపుల గురించి మొర పెట్టుకుంటూనే ఉన్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత మాలీవుడ్ లో కలకలం గురించి తెలిసినదే.
ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఇఫీ 2024 ఉత్సవాల్లో నటి ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఖుష్బూ మహిళల భద్రతపై బహిరంగంగా మాట్లాడారు. సినీ పరిశ్రమలో కూడా మహిళల భద్రత వారి చేతుల్లోనే ఉందని ఖుష్బూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన పాత కథ ఒకదానిని అందరితో షేర్ చేసారు.
నేను నా కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. ఒక సినిమా షూటింగ్ సమయంలో హీరో నాతో చాలా విచిత్రంగా మాట్లాడాడు. మేమిద్దరం టీమ్‌కి దూరంగా ఒక సన్నివేశం చిత్రీకరణలో పాల్గొన్నాం. ఆ సమయంలో నాకు ఏదైనా అవకాశం ఉందా? అని అతడు నన్ను అడిగాడు. నేను వెంటనే నా చెప్పులు తీసి అతడికి తగిన సమాధానం ఇచ్చాను. ``నా చెప్పుల పరిమాణం 41.. కాబట్టి మిమ్మల్ని దానితో ఇక్కడే కొట్టాలనుకుంటున్నారా? లేదా మొత్తం యూనిట్ ముందు కొట్టాలనుకుంటున్నారా? అనడిగాను. ఆ తర్వాత నాతో ఏమీ అనడానికి అతడికి ధైర్యం చాలలేదు...`` అని తెలిపారు.
ఒక మహిళకు ఏదైనా జరిగితే వెంటనే స్పందించాలని ఖుష్బూ సుందర్ అన్నారు. సినిమా సెట్స్ లో ఏదైనా ఇబ్బంది లేదా వేధింపులు ఎదురైతే ఎప్పుడూ దానిని లైట్ తీస్కోకూడదని అన్నారు. కొంతకాలం క్రితం ఖుష్బూ సుందర్ తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని వెల్లడించిన సంగతి తెలిసిందే.