నా పెళ్ళిలో కార్తీక్ అలా చేస్తాడనుకోలేదు..హీరోయిన్ ఖుష్బూ..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి వివాహం గురించి ప్రస్తావించిన ఖుష్బూ.. హీరో కార్తీక్ గురించి కూడా చెప్పారు.
By: Tupaki Desk | 7 July 2024 9:58 AM GMTహీరోయిన్ ఖుష్పు అంటే ఇప్పటివరకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకంలో ఆమె టాప్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్న ఖుష్పు తమిళ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరు మోసిన హీరోయిన్‌గా కొనసాగింది.1988లో తమిళంలో వచ్చిన ధర్మతిన్ తలైవన్ అనే మూవీతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.
అప్పట్లో ఖుష్పుకు ఆమె అభిమానులు గుడి కట్టించారు.. దీన్నిబట్టి ఆ టైంలో ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో ఆలోచించండి.’16’, ‘విక్టరీ ఫెస్టివల్’, ‘ఇష్టి వాసల్’, ‘మైఖేల్ మదన కామరాజన్’, ‘నడిగన్’, ‘చిన్నతంబి’ లాంటి వరుస హిట్స్‌తో ఖుష్పు అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయింది. విక్టరీ వెంకటేష్ ఫస్ట్ మూవీ ‘కలియుగ పాండవుల’తో ఖుష్పు కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పటి తమిళ్ స్టార్ హీరోలు రజనీ, కమల్, శరత్‌కుమార్, ప్రభు, సత్యరాజ్ లతో తమిళ్లో సుమారు 100కు పైగా చిత్రాలలో ఆమె నటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో ఆమె సుమారు 200 పైగా చిత్రాలు చేసింది.
2000 సంవత్సరంలో దర్శకుడు సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ డైరెక్టర్ గా పరిచయమైన మొదటి చిత్రం ‘మాత్రమామన్’ లో హీరోయిన్‌గా ఖుష్బూ నటించడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. అప్పుడే సుందర్ ఆమెకు ప్రపోజ్ చేశాడట. ఆ తర్వాత ప్రేమించుకున్న ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి వివాహం గురించి ప్రస్తావించిన ఖుష్బూ.. హీరో కార్తీక్ గురించి కూడా చెప్పారు.
తన పెళ్లికి వచ్చిన కార్తీక్ బోరును ఏడ్చారు అని ఖుష్బూ చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే..ఖుష్బూ, సుందర్ ప్రేమించుకుంటున్న విషయం మొదట ఎవరికీ చెప్పలేదట. అయితే ఒక సందర్భంలో సుందర్ ఈ విషయాన్ని కార్తీక్‌కి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్ ఖుష్బూకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఖుష్బూ పెళ్లికి వచ్చిన కార్తీక్ వధూవరులను ఆశీర్వదించి,ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారని..ఖుష్బూ వెల్లడించారు. తాను లైఫ్‌లో హ్యాపీగా ఉన్నందుకు కార్తీక్ ఆరోజు చాలా ఎమోషనల్ అయ్యారని ఖుష్బూ అన్నారు.